అదే సమయంలో నల్ల పిల్లి మేలుకుంటుంది.
*meow*
బైరవ (పిల్లి): హ్మ్?
సవ్యసాచి: ఆ?
ఇద్దరూ ఒకేసారి వెనక్కి తిరిగి చూస్తారు.
పిల్లి ఎటువంటి శబ్దం చేయకుండా మెల్లగా జారుకోవడానికి సోఫా మీద నుంచి కదలబోతుంది.
సవ్యసాచి: బైరవ! పిల్లి మెలుకుంది!!
అని ఆనందంతో అనగానే వాళ్ళ గొంతు విని పిల్లి ఉలిక్కిపడుతుంది.
ఇద్దరూ పిల్లినే కల్లార్పకుండా చూస్తుంటారు.
ఆ పిల్లికి వెన్నులో వణుకు పుడుతుంది.
వెంటనే పైకి లేచి బుసలు కొట్టడం మొదలుపెడుతుంది.
*hiss* *hiss* *hiss*
*hiss* *hiss* *hiss*
*hiss* *hiss* *hiss*
బైరవ (పిల్లి), సవ్యసాచిని ఇద్దరినీ గమనించాకా కుంచం కుంచంగా వాళ్ళిద్దరి చేతుల్లో తిన్న తన్నులు గుర్తుకొస్తాయి.
పిల్లి షాకుతో కదలకుండా స్తంభంలా ఉండిపోతుంది.
వీళ్ళను గెలికితే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారని అర్ధం చేయనుకోని తోక ముడుచుకొని కూర్చొని తనను తాను నాలుకతో క్లీన్ చేస్కోవడం మొదలుపెడుతుంది.
సవ్యసాచి:....
బైరవ (పిల్లి): ఏమైంది వీడికి?
అలా ప్రవర్తిస్తున్నాడు..?
అని సవ్యసాచిని అడుగుతాడు.
ఆమె మెల్లగా వెళ్లి పిల్లిని చేతులతో ఎత్తుకొని ఒడిలో కూర్చో బెట్టుకుని కింద కూర్చుంటుంది.
నల్ల పిల్లి: హా?....
సవ్యసాచి: హమ్మయ్య! నువ్వు మెలుకున్నావ్! మంచిదయింది నీకేం కాలేదు.
అని నవ్వుతూ నల్ల పిల్లిని చూస్తూ అంటుంది.
నల్ల పిల్లి: హ్మ్?...
ఆమె బుగ్గలు నిమరబోతే తను మొఖం తిప్పుకుంటాడు.
సవ్యసాచి: బైరవ గారూ. నేను వీడ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చా?
బైరవ (పిల్లి): ఏంటి?
సవ్యసాచి: చూడండి. వీడు మంచి వాడిలా ఎంత సైలెంటుగా ఉన్నాడో?
హాస్పిటల్కి తీసుకెళ్ళితే అక్కడ కూడా ప్రశాంతంగా ఉంటాడు కదూ?
అని ఆనందంతో అడుగుతుంది.
ఆమె కళ్ళకి పిల్లి సైలెంట్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది.
బైరవ (పిల్లి): హ్మ్?... నీకలా అనిపిస్తుందా?
నాకలా అనిపిట్లా!..
వీడు సైలెంట్గా లేడు...
భయంతో నీలుక్కొని కదలకుండా ఉన్నాడు...
అని సవ్యసాచికి చెబుతాడు.
బైరవ చెప్పినట్టుగానే పిల్లి షాకుతో కదలకుండా గమ్మున కూర్చొని ఉంటుంది. కాకుంటే లైటుగా వణుకుతూ ఉంటుంది.
సవ్యసాచికి ఆ విషయం తెలీక నల్ల పిల్లి పారిపోకుండా సైలెంట్ ఉందని మురిసిపోతుంది.