భైరవ: ఏం వాగుతున్నావ్?..
ఎవరెలా పోతే నీకేంటి?
సవ్యసాచి సీరియస్గా చూస్తుంది.
ఈ పిల్ల చూడు...
సీరియస్గా ఎలా చూస్తుందో...
తన ప్రాణం పోతుందని తెలిసి కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది..
నిజానికి ఈ పిల్ల....
తిక్కల్ది...
సవ్యసాచి: నువ్వు జాగర్తగా ఇంటికి వెళ్ళు.
నేను ఆ కాట్ మాంస్టర్ గురించి ఏదోకటి చేస్తాను.
అది కచ్చితంగా తనే..
తను చాలా మంచి పిల్లి...
తనలా ఎందుకు మారిపోయిందో నాకు తెలీదు..
కానీ తనని నేనలా వదిలి వెళ్ళలేను...
భైరవ గట్టిగా ఊపిరి తీసుకోని వదులుతాడు.
భైరవ: నువ్వు మైండ్లో ఫిక్స్ అయ్యావు కాబట్టి..
నేను కూడా నీకు సహాయం చేస్తాలే..
సవ్యసాచి: ఏంటి?..
అతను కిందకు దిగి నేల మీద కూర్చుంటాడు.
భైరవ: గొడవ పడటానికి సరిపోయేలా నా శక్తీలో నుంచి కుంచం నీకు ఇస్తాను.
ఆ శక్తితో కాట్ మాంస్టర్ ని ఓడించ గలుగుతావు.
సవ్యసాచి: నిజంగా?.. నువ్వలా చేయగలవా?..
భైరవ: ఓయ్.. ఓవర్గా సంతోషపడకు..
నా పూర్తి శక్తీలో బియ్యం గింజంత శక్తిని మాత్రమే నీకిస్తున్నా..
దాని ప్రభావం కాసేపు మాత్రమే ఉంటుంది.
వినిపిస్తుందా?...
సవ్యసాచి: హహహహ...
భైరవ: నాకు అందేలా కింద కూర్చో!
సవ్యసాచి: సరే..
ఆమె మెట్ల చివర కూర్చుంటుంది.
పిల్లి ఆమె తలమీద పంజాను మెల్లగా అనిస్తుంది.
ఆ...
ఎంత మృదువుగా ఉందో....
భైరవ: హ్మ్.....
సవ్యసాచి: హా?..
ఆమె శరీరంలో చిన్న పాటి ఆకారంలోని మెరుపు తరంగాలు వెలువడుతాయి.
సవ్యసాచి: వో... నా శరీరంలో శక్తి తరంగాలను నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను...
ఇది మెరుపుశక్తి..
భైరవ:... ఎందుకంటే నా శక్తి మెరుపు కాబట్టి..
అలసిపోయాన్రా బాబూ...
సవ్యసాచి: వావ్!.. చాలా అధ్బుతంగా ఉంది..
నేనిప్పుడే వెళ్లి పిల్లి కోసం వెతుకుతాను!..
భైరవ: నాకు తెలిసి ఆ అవసరం లేదు.
అదే నిన్ను వెతుక్కుంటూ వచ్చేసింది.
***గ్ర్ర్...***
సవ్యసాచి వేగంగా భైరవ ఎదురుగా నిలబడుతుంది.
సవ్యసాచి: నా వెనకే ఉండు భైరవ.
భైరవ: హహ్?..
ఏం మాట్లాడుతున్నావ్?..
నన్ను నీ వెనక దాక్కో మంటున్నావా?..
ఏంటి?.. కామెడీనా?.. నేను నవ్వాలా?...
అతను సవ్యసాచి మొఖాన్ని చూస్తాడు.
ఈ పిల్లకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది?...
తన దెగ్గర నా శక్తి ఉంది..
కాకుంటే క్షణంలో భయం అనేది మాయం అయిపోవడం సాధ్యం కాదు..
ఈ ధైర్యం నేనిచ్చిన శక్తి వల్ల రాలేదు..
సవ్యసాచి: నువ్వు.. ఒకప్పుడు భోంచేయడానికి నా ఇంటికి వస్తూ ఉండే వాడివి..
భైరవ: ఓయ్.. తిక్కల్... అదేనా నీ మొదటి డైలాగ్?..
నీ మాటలు దానికి అర్థం అవుతాయని అనుకుంటున్నావా?..
సవ్యసాచి: ...చాలా రోజుల క్రితం నుంచి నువ్వు ఇంటికి రావడం మానేశావ్..
ఏమైంది నీకు?... ఎందుకిలా మారిపోయావ్?..
***గ్ర్ర్... హిస్స్...***
కాట్ మాంస్టర్ దాడి చెయ్యడానికి ఆమె మీదకు దూకుతుంది.
భైరవ: చూస్తూ నిలబడ్డావ్ ఏంటి?..
అక్కడి నుంచి కదులు!...
కాట్ మాంస్టర్ ఆమె ఎదురుగా వచ్చి పంజాతో దాడి చేస్తుంది.
ఆమె వేగంగా కిందకు వంగి కూర్చుంటుంది.
ఆమె వెనుక ఉన్న గోడను పంజాతో గీకుతుంది.
సవ్యసాచి: హమ్మయ్య...
భైరవ: హహ్?....
కాట్ మాంస్టర్ ఆగకుండా ఆమె మీదకు దాడి చేస్తుంది.
సవ్యసాచి వేగంగా దాడులను తప్పించుకొని కదులుతూ ఉంటుంది.
ఆమె అదృష్టం వల్ల తప్పించుకోలేదు.
కాట్ మాంస్టర్ యొక్క ప్రతీ కదలికను దీర్గంగా పరీక్షిస్తూ దానికి అనుగుణంగా ఆమె కదులుతోంది..
కానీ ఎలా?.. అంత వేగంగా కదలడమనేది మామూలు మనిషికి అసాధ్యమైన పని..
అది మాత్రమే కాదు!..
దాన్నుంచి తప్పించు కుంటున్నప్పుడు నేనిచ్చిన శక్తిని ఒక్కసారి కూడా ఉపయోగించలేదు..
ఆమె వేగంగా దాడుల నుంచి తప్పించుకొని పక్కకు నిలబడుతుంది.
భైరవ ఇచ్చిన శక్తితో నేను కాసేపు మాత్రమే పోరాడగలనని చెప్పాడు..
నేను ఆ శక్తిని సమయం వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగిస్తాను..
ఇప్పుడు మాత్రం..
ఆమె వేగంగా దాడి నుంచి తప్పుకొని గోడ మీదకు దూకుతుంది.
ఆ శక్తి...
అది నేనిచ్చిన శక్తి ఏమాత్రం కాదు...
అశ్చర్యంగా ఉంది..
ఆ కాట్ మాంస్టర్ ఆమె వేగానికి సరితూగలేక పోతోంది..
ఆమె గోడ పై నుంచి వేగంగా ఎగిరి దూకబోతుంది.
బహుశా...
ఆమెకు....
అతి వేగం శక్తి ఉందేమో?...
ఆమె వేగంగా కిందకు పడుతుండగా మెరుపు శక్తిని పిడికిలోకి తెచ్చుకొని దాడి చేస్తుంది.
సవ్యసాచి: నన్ను క్షమించు పిల్లి...
***భూం..***
@@@
నేల బద్దలవుతుంది.
ఆమె అలసట వల్ల గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఉంటుంది.
సవ్యసాచి: హాఫ్... హఫ్... హఫ్..
భైరవ: గొడవలో నువ్వు చాలా నమ్మకంతో ఉన్నావు..
బహుశా నీ శక్తి వల్లా?..
అతను నడుచుకుంటూ వచ్చి ఆమె ఎదురుగా నిలబడుతాడు.
మాంస్టర్ కాట్ ఓడిపోయి స్పృహ తప్పి పడి ఉంటుంది.
సవ్యసాచి: హహహహ...
తను... తను చనిపోలేదు కదా?...
భైరవ: లేదు. స్పృహ తప్పిందంతే.
హటార్తుగా మాంస్టర్ కాట్ ఆకారం మామూలు పిల్లి ఆకారానికి మారిపోతుంది.
సవ్యసాచి: అది.. నేననుకున్నది నిజమే.. అది నువ్వే..
భైరవ: సవ్యసాచి. సమయం లేదు. మనమిక్కడ ఉండకూడదు.
మనం చేసిన గొడవ విన్న వాళ్ళు కాసేపట్లో వస్తారు.
సవ్యసాచి: సరే..
ఒక 45 ఏళ్ల వయసున్న వ్యక్తి మొబైల్ టవర్ మీదకు ఎక్కి నిలబడి ఉంటాడు.
అతని చేతిలో మొబైల్ ఉంటుంది. అందులో మ్యాప్ లొకేషన్ చూస్తూ ఉంటాడు.
నాకర్థం కావట్లా..
హటార్తుగా శాంపిల్ యొక్క ట్రాకర్ మాయమై పోయిందేంటి?..
గంట క్రితం ఈ చోట్లో లొకేషన్ పాయింట్ కనిపించింది..
ఇది విరిగి పోయిందా ఏంటి?..
ఛా!..
ఇంకేంటి?.. ఇక నుంచి నా శక్తి తో శాంపిల్ మీద బలవంతంగా ఇంప్రింట్ చెయ్యాలా?..
**క్రాక్**
అతను కోపంలో అరచేత్తో మొబైల్ను నలిపి విరిచేస్తాడు.
దీనమ్మ.. అలా చేస్తే హంటర్స్ నన్ను తేలికగా కనిపెట్టేస్తారు..
కానీ మరోదారి కనిపించట్లా..
నా పవర్ఫుల్ శాంపిల్ను చేజార్చుకోలేను.
అతను కళ్ళు మూసుకొని తెరవగానే అతని కళ్ళు ఎర్రటి లావా రంగులోకి మారుతుంది.
"నువ్వెక్కడున్నావ్?...
ఈ క్షణంలో నా కళ్ళ ముందుకిరా!..."
****