下載應用程式
31.03% ⚡మెరుపువేగం⚡ / Chapter 9: 9

章節 9: 9

భైరవ:... అధ్బుత శక్తులున్న మనుషులని అబిలిటీ యూసర్స్ అని పిలుస్తారు.

ఈ శక్తులు ఎప్పుడు ఎక్కడ ఎలా మనుషుల్లో వచ్చాయో ఇప్పటికి అంతు చిక్కని రహస్యమే.

పురాణాల ప్రకారం చూస్తే, మనలాంటి శక్తులు ఉన్నవాళ్ళు అందరూ దేవతల వారసులమని అనుకోవచ్చు.

శక్తులు అన్నవి రెండు రకాలు.

మొదటిది శరీరానికి సంబంధమైనది.

రెండోది నీ చుట్టూ ఉండే పరిసరాలు, ప్రకృతికి సంబంధమైనది.

ఇలాంటి శక్తులు ఉన్నవాళ్లు తలచుకుంటే కృష్ణుడిలా చిటికిన వేలుతో పర్వతాన్ని ఎత్తొచ్చు.

భీముడిలా పిడికిలితో కొండలినైనా పిండి చేయొచ్చు.

హనుమంతుడిలా గాల్లో ఎగరొచ్చు.

దానితో పాటుగా రూపం మార్చుకోవచ్చు. గాల్లో నిప్పు, నీళ్లను సృష్టించొచ్చు... ఇంకా చాలానే చెయ్యొచ్చు.

అంతెందుకు. నా శక్తి మెరుపు. నేను చిటికలో మెరుపులని నాకు నచ్చినట్టుగా సృష్టించగలను.

సవ్యసాచి: వావ్... అంటే అచ్చం సినిమాలో హీరోళ్లగానా?..

మీసం తిప్పి తొడకొడితే ట్రైన్ను కూడా ఆపొచ్చా?

భైరవ:.... నీకు మీసాలు వచ్చాక ట్రై చేద్దులే..

సవ్యసాచి: ఓకే.. ఓకే.

భైరవ:.....

సవ్యసాచి: అంటే నేను కూడా సినిమాల్లో లాగా సూపర్ పవర్స్ ఉన్న హీరోయిన్ నా?

భైరవ: అంతేగా.. అంతేగా...

నీ శక్తితో చాలానే చెయ్యొచ్చు.

నీ కోర్ అబిలిటీ వేగం కాబట్టి దానికి తగ్గట్టు ఏమైనా చెయ్యొచ్చు.

నీ చిన్నప్పటితో పోలిస్తే ఇప్పుడు నీ శక్తులు బలంగా మారుండాలి.

సవ్యసాచి: అవును. నా చిన్నప్పుడు రోజుకి ఒక్క క్షణం వరకే వేగంతో మాత్రమే కదలగలిగే దాన్ని.

ఇప్పుడు 3 నుంచీ 5 క్షణాల వరకూ వేగంగా పరిగెత్త గలను.

భైరవ: అంతేనా?

అవునులే..

నీకు చిన్నప్పటి నుంచీ నీ శక్తిని ఉపయోగించాలంటే భయం ఉండేది.

కాబట్టి నువ్వు ఎక్కువాగా నీ శక్తులని ఉపయోగించేదానివి కావు.

నీ గతం గురించి విన్నాక నువ్వు మామూలు ప్రాక్టీస్ చెయ్యాలనే ఆలోచన రాకపోవటం కూడా సాధారణమే.

నీ చుట్టూ ఉన్న వాళ్ళను నీ శక్తుల గురించి కనిపెట్టేస్తారని భయపడుతూ బ్రతికావు కదా..

సవ్యసాచి: అంటే నాలా శక్తులు ఉన్నవాళ్లు ట్రైనింగ్ తీసుకుంటారా?

భైరవ: అఫ్కోర్స్! నిజం చెప్పు చిన్నప్పుడు టీవిలో పవర్ రేంజర్స్ చూసి అందులో ఉన్నవాళ్ళలా శక్తులు ఉంటే ప్రపంచాన్ని కాపడొచ్చని, డబ్బు, పేరు, పాపులరిటీ సంపాదిచొచ్చని, ఒక్కసారి కూడా నువ్వు అనుకోలేదా?

సవ్యసాచి: హిహిహిహిహి.. అనుకున్నాను..

కానీ.. ఇప్పుడు అలా అనుకుంట్లేదు..

భైరవ: ఎందుకంటే.. నువ్వు అందరికంటే విచిత్రమైన పిల్లవి కనుక...

ఆమె పొట్ట ఆకలికి తుర్రు మంటుంది.

సవ్యసాచి: హిహిహిహిహి... అంటే.. నిన్న రాత్రి తర్వాత నుంచీ ఏం తినలేదు కదా.. ఆకలేస్తోంది..

భైరవ: మనమిక్కడ ముఖ్యమైన విషయాలు డిస్కస్ చేస్తుంటే నీకు ఈ టైంలో ఆకలేస్తుందా?

సవ్యసాచి: ఒక్క నిమిషం ఆగు. తినడానికి ఏమైనా తెస్తాను.

ఆమె బిస్కెట్ పాకెట్ తెచ్చుకొని తినబోతుంది.

అదే సమయంలో భైరవ పొట్ట కూడా ఆకలికి తుర్రు మంటుంది. ఆమె వింటుంది.

భైరవ అవమానంతో నోరు తెరుచుకొని తెల్ల మొఖం పెడతాడు.

ఆమె విని వెనక్కు తిరిగి చూస్తుంది. అతను చూపు తిప్పుకుంటాడు.

సవ్యసాచి గదిలోకి వెళ్లి కాట్ ఫుడ్ పాకెట్ తీసుకోని వచ్చి కడిగిన ప్లేట్ లో నింపుతుంది.

సవ్యసాచి: భైరవకు కూడా ఆకలేస్తుంది కదా?

నువ్వు కూడా నిన్న రాత్రి తర్వాత నుంచీ ఏం తినలేదు కదా..

అతను అవమానంతో తల దించుకొని నిలబడుతాడు.

నమ్మశఖ్యంగా లేదు..

నేను మళ్ళీ కాట్ ఫుడ్ తినాలా?...

తూ! నా బండ పిల్లి బతుకు...

సవ్యసాచి: పర్లేదు. తిను. ఇది కాట్ ఫుడ్ అని తెలుసు. కానీ నువ్వు పిల్లి రూపంలో ఉన్నప్పుడు మనుషులు తినే ఆహారం తినడం నీ ఒంటికి మంచిది కాదు.

కష్టంగా అనిపిస్తే కళ్ళు మూసుకొని నమిలి గుట్టుక్కున మింగేయ్.

అతను గట్టిగా ఊపిరి తీసుకోని వదిలి కాట్ ఫుడ్ తింటాడు.

సవ్యసాచి ఆనందంగా నవ్వుతూ బిస్కెట్స్ తింటుంది.

వాళ్లిద్దరూ తింటుండగా వాళ్ళు ఉన్న ఇంటి చుట్టూ ఒక ఎరుపూ నలుపూ రంగుల పొగ చుట్టుతుంది.

భైరవ దాన్ని పసిగడుతాడు.

ఏంటీ ఎనర్జీ ?..

నా శక్తులు బలహీనంగా ఉండటం వల్ల సరిగ్గా గమనించలేదు..

ఈ ఎనర్జీ ఇంటి చుట్టూ అలుముకుంతోంది..

ఇలాంటి ఎనర్జీ ఇంటిని చుట్టు ముట్టడం సాధారణమైన విషయం కాదు..

హటార్తుగా నల్ల పిల్లి మేలుకుంటుంది. దాని కళ్ళు ఎర్రగా మునపటిలా మారిపోతాయి.

మాంస్టర్ ఆకారంలోకి తిరిగి మారిపోతుంది.

మేలుకొని దాని చుట్టూ ఉన్న సామాన్లు ధ్వంసం చేస్తుంటుంది.

భైరవ: ఏమైంది దీనికీ...

వేగంగా అటూ ఇటూ దూకుతూ కిటికీలో నుంచి బయటకు దూకి పారిపోతుంది.

ఓరినీ యమ్మా బడవా... ఈ పిచ్చి పూ.. పిల్లికేమైంది?..

సవ్యసాచి: భైరవ! పిల్లి పారిపోయింది..

భైరవ: నాక్కూడా కళ్ళున్నాయి. నువ్వేం సెపరేట్ గా చెప్పక్కర్లేదు.

ఇంత త్వరగా ఎలా మేలుకుంది?..

బహుశా ఆ ఎనర్జీ వల్లనా?

సవ్యసాచి పక్కకు వెళ్లి దుప్పట్టా తీసుకోని మోకానికి కట్టుకుంటుంది.

భైరవ: ఏం చేస్తున్నావ్?.

సవ్యసాచి: పిల్లిని కనిపెట్టడానికి వెళ్తున్న.

తన వల్ల ఎవరికైనా గాయాలయితే? అందుకే..

భైరవ: ఒకవేళ దొరికినా ఏం చేస్తావ్?

మొదటిసారి ఏమో తప్పదు కాబట్టి చేసావ్.

ఈ సారి వెళ్లి నీ వేలు పెట్టక్కర్లేదనుకుంటా?

అందులోనూ, కిందటిసారిలా మాంస్టర్ లా మారడానికి దాని ఒంట్లో శక్తి ఉండక పోవచ్చు అనుకుంటా..

సవ్యసాచి: అలా అయితే తనని మరింత తేలికగా కనిపెట్టేయొచ్చు.

నిజమే.. నాకు మిగతా వ్యక్తుల గురించి కూడా దిగులుగానే ఉంది..

అలాగే పిల్లి గురించి కూడా..

పట్టించుకోకుండా వదిలేస్తే తను ఇతరులని గాయపరచడమో లేదా ఆ ప్రయత్నంలో తనే గాయపడుతుందని తెలిసి నేను మనస్సంతిగా ఉండలేను.

భైరవ ఆమెను అశ్చర్యంగా చూస్తాడు.

భైరవ: సరేలే. పదా! నేనూ వస్తా!

సవ్యసాచి: నిజంగా?

భైరవ: నిజంగా! నేనొచ్చేది ఆ నల్ల పిల్లి కోసం. దానోతో పాటుగా ఆ ఎనర్జీ ఎవరిదోనని తెలుసుకోవటం కోసం మాత్రమే.

నేను నీ మీద దిగులుతో వస్తున్నానని అనుకోకు!

సవ్యసాచి: హిహి.. థాంక్స్.

భైరవ కూడా నాకు తోడుగా వస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది.

భైరవ: మాట్లాడింది చాల్లే. నా వెనకే ఫాలో చేయ్!

ముందే చెప్పా!.. మిస్ అండర్స్టాండింగ్ చేసుకోకు!

సవ్యసాచి: సరే సార్. నేనలా అనుకోను. హిహీ..

భైరవ: హ్మ్...

వాళ్లిద్దరూ బయలుదేరుతారు.


Load failed, please RETRY

每周推薦票狀態

Rank -- 推薦票 榜單
Stone -- 推薦票

批量訂閱

目錄

顯示選項

背景

EoMt的

大小

章評

寫檢討 閱讀狀態: C9
無法發佈。請再試一次
  • 寫作品質
  • 更新的穩定性
  • 故事發展
  • 人物形象設計
  • 世界背景

總分 0.0

評論發佈成功! 閱讀更多評論
用推薦票投票
Rank NO.-- 推薦票榜
Stone -- 推薦票
舉報不當內容
錯誤提示

舉報暴力內容

段落註釋

登錄