下載應用程式

章節 3: 3

──•~❉©Farruarts©❉~•──

సమయం: ఉదయం 7:30 am

──•~❉᯽❉~•──

నెక్రోమాన్సర్,

"...అంటే నేను సరైన ప్రదేశానికి వచ్చానన్న మాట!.."

ఫరీదా భయంతో గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఉంటుంది.

ఫరీదా,

"...నీకు నా నుంచి ఏం కావాలి?'

ఆ నెక్రోమాన్సర్ దీర్ఘంగా ఆమె వైపు చూస్తూ,

"మాములు మనుషుల లాగా నువ్వు భయంతో అరిచి గీ పెడతావాని అనుకున్నా! కానీ భయంలో కూడా నన్ను చంపేసేలా చూస్తున్నావ్!? అనవసరంగా ఈ గది చుట్టూ సౌండ్ ప్రూఫ్ బారియర్ అమర్చాను~

కికికికికికి.. సరే! నా గురించి చెప్తా విను! నేను ఒక నెక్రోమాన్సర్ని. దారి తప్పి సంచరించే ఆత్మలకు సరైన దారి చూపించడం, మాట వినని క్రూరమైన ప్రేతాత్మలను బంధించి నైరుతీ నదిలో కలపడం.. లేదా నరకంలో డైరెక్ట్ గా వాళ్ళను శిక్షించేలా చేయటం.. లాంటి బోరింగ్ పనులు చేస్తూ ఉంటాను.

మనుషుల ఆత్మలను తీసుకెళ్లడం ఎంత బోరింగ్ గా ఉంటుందంటే వాళ్ళ అరుపులు ఏడుపులు వినీ వినీ నా పుర్రెకు చిల్లడి పోయింది. ఛీఛీ! బుర్రకు చిల్లడి పోయింది!" అని పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటాడు.

అతని మాటలు వింటుంటే ఫరీదాకు భయంతో చెమటలు పడతాయి. కానీ మరో వైపు,

*ఈ పుర్రె గాడి పుర్రెలో బుర్రే లేదనుకుంటా!?* అని మనసులో ఆలోచిస్తూ ఉంటుంది.

ఇదా,

*ఫరూ! నిజంగా వాడి పుర్రెలో బుర్ర లేదు!హహహహ...* అంటూ ఆట పట్టిస్తూ ఉంటాడు.

నైరుతీ నదిలో కలవటం, నరకానికి వెళ్ళటం ఒకటే..

ఫరీదా,

"అంటే నన్ను నరకానికి తీస్కెళ్ళుతావా?"

నెక్రోమాన్సర్,

"...అవును! మీరు ఇద్దరు దారి తప్పిన ఆత్మలు మర్యాదగా ఒప్పుకొని నాతో వస్తే మీకు పడబోయే శిక్ష కుంచం తగ్గే అవకాశం ఉంది." అంటూ ఫరీదాను బెదిరిస్తాడు.

అది విన్న తర్వాత తన మనసుకు దిక్కు తోచ లేదు. అతను చాలా శక్తి వంతుడు. అతనికి ఎదురు తిరిగే శక్తి ఫరీదాకు లేదు. అలాగే, ఏ తప్పూ చేయని తనను నరకంలో ఎందుకు తీస్కెళ్తున్నారని మనసులో ఆవేదన కలిగుతుంది.

అది అర్థం చేసుకున్న నెక్రోమాన్సర్,

నెక్రోమాన్సర్,

"..నీ మనసులో ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు, ఉన్నాయని నాకు అర్థమైంది. నేను నీకు పూర్తి వివరాలు చెప్పకూడదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను, మీ ఇద్దరి గత జన్మ కర్మల వలనే ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ల వలసి వస్తోంది. దయచేసి నాతో పదండి."

నరకానికి వెళ్ళాలంటే శరీరం మరణించాలి. అలా జరగాలంటే నాలుగు దారులున్నాయి. ఒకటి, ఆత్మహత్య చేసుకోవాలి. రెండు, ఆక్సిడెంట్ జరగాలి. మూడు, హత్యకు గురవ్వాలి. నాలుగు, అనారోగ్యం వల్ల అయినా మొసలి వయసు వల్ల మరణించాలి.

ఫరీదాను హత్య చేసేంత పగ ఈ లోకంలో ఎవరికీ లేదు.

ఆక్సిడెంట్ కు గురైతే తన వల్ల ఒక నిర్దోషి బలవ్వటం తనకు ఇష్టం లేదు.

ఆమెకా ఏ జబ్బులూ లేవు. అలాగే వయసులో ఉంది.

ఇక మిగిలింది సూసైడ్ మాత్రమే..

ఫరీదా,

"నేను సూసైడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.. కానీ నాకు ఒక చివరి కోరిక ఉంది అది పూర్తి చేసుకోడానికి నాకు కుంచం సమయం ఇస్తావా? నువ్వు

సరే అంటే.."

నెక్రోమాన్సర్,

"సరేలే! నేను ఒప్పుకుంటున్నాను!. ఒక వారం గడువు ఇస్తున్నాను! ఆదివారం రాత్రి పన్నెండు గంటలకు నువ్వు ఎక్కడున్నా.. ఎలా ఉన్నా.. ఏం చేస్తున్నా.. నీ ఆత్మను బలవంతంగా అయినా నాతో తీసుకొని వెళతాను. గుర్తుంచుకో!" అని బెదిరిస్తాడు.

ఫరీదా సరే అంటూ బాధతో తల ఊపుతుంది.

నెక్రోమాన్సర్ బ్లాక్ హోల్ ఓపెన్ చేసి లోపలకు వెళ్లి నిలబడుతాడు,

"అన్నట్టు చెప్పడం మర్చిపోయా! స్నానం చేస్తున్నప్పుడు నువ్వు చూడటానికి కత్తిలా ఉన్నావ్!" అని పొగుడుతాడు.

ఫరీదా కోపంతో సబ్బును తీసుకొని అతన్ని కొడుతుంది.

"పుర్రె సచ్చినోడా! ఆడపిల్లలు స్నానం చేస్తుంటే చూస్తావా? నీ పుర్రెకు పురుగులు పట్టి పోతావ్!" అని గట్టిగా అరుస్తుంది.

అతను వెంటనే అక్కడి నుంచి మాయమయి పోతాడు.

కానీ ఆ సబ్బు మాత్రం అతని పుర్రెలో ఇరుక్కుంటుంది.

"కికికికికికి... నేనేదో తమాషాకు చెప్తే నిజంగా స్నానం చేస్తుంటే చూసాననుకుంది. పిచ్చిది! ఇంతకీ ఇప్పుడీ సబ్బుని నా పుర్రె నుంచి ఎలా శుభ్రం చెయ్యాలో ఏంటో..."

──•~❉᯽❉~•──

సమయం: ఉదయం 8:05 am

──•~❉᯽❉~•──

చాలా సేపు దీర్ఘంగా ఆలోచించిన తర్వాత, ఫరీద బాత్రూం నుంచి బయటకు వస్తుంది.

ఇంట్లోకి వెళ్ళిన వెంటనే తన అమ్మ, నాన్న తమ్ముడు కలిసి భోజనం చేయటం చూసి ఫరీద కళ్ళ వెంట నీళ్లు పారాయి.

తను చావ బోతోంది. ఇక తన తల్లితండ్రులను చూడలేదు, కలవలేదు, మాట్లాడలేదు.. వాళ్ళ చేత తిట్లు కూడా తినలేదు..

అమ్మ,

"దున్నపోతా! ఎంత సేపు స్నానం చేసేది?"

తమ్ముడు,

"అమ్మ! నేను వెళ్లి మోటార్ వేసి వస్తా! ఈ పిల్ల నీళ్లన్నీ అవగొట్టేసి ఉంటది!"

ఫరీదా,

*ఈ కొంప నుంచి పోతున్నందుకు ఇప్పుడు నేను నవ్వాలా? ఏడవాలా?* అని మనసులో అనుకుంటుంది.

తన మనసులో ఇన్నాళ్లు చేయాలని అనుకొని కూడా చేయలేక పోయిన కొన్ని ముఖ్యమైన పనులు ఎలాగైన పూర్తి చేయాలని నిర్ణయించుకుంటుంది.

ఫరీదా,

"అమ్మ, నాన్న నాకు చిన్న పని ఉంది. అది పూర్తి చేసుకొని నేను సాయంత్రం లోపల ఇంటికి వచ్చేస్తాను. మీరు జాగర్త." అని వాళ్ళతో చెబుతుంది.

నాన్న,

"ఏంటి? పొద్దున్నే ఇక్కడికి?..."

అమ్మ,

"ఆడపిళ్లవి ఒంటరిగా ఇక్కడికి? తమ్ముడ్ని తోడుగా తీస్కెళ్ళు!"

తమ్ముడు,

"ఆ? ఎక్కడికి అక్కా? నేనూ తోడుగా వస్తాను పదా!?."

వాళ్ళు చూపించిన పరిరక్షణ చూసి ఫరీద కళ్ళ వెంట నీళ్లు తిరిగుతాయి. కానీ అంతలోనే,

తమ్ముడు,

"పదా! దూరంగా తీసుకెళ్లి ఖర్చులకు డబ్బులు ఇవ్వకుండా వదిలి వచ్చేస్తా! హీహీహీ..." అని ఎగతాళి చేస్తాడు.

ఫరీదా,

*ముందు వీడ్ని జూ లో వదిలేయాలి! గోరిల్లా గాడు!* అని మనసులో తిట్టుకుంటుంది.

ఇదా,

*కోడొచ్చి చికెన్ షాప్ ముందు తొడ కొట్టిందంట! సాలే గాడిని ఫ్రై చేసుకొని తినేస్తా! నా ఫరీ నే అన్నేసి మాటలంటాడా?!..* అని కోపంతో ఎగురుతూ ఉంటాడు.

ఆమె కన్నీళ్లు అనుచుకొని నవ్వుతూ ఉంటుంది,

ఫరీదా,

"అదేం లేదు అమ్మ , నాన్న... నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్న! తను నాకు ఒక జాబ్ గురించి చెప్పింది. ఆ జాబ్ ఎక్కడ, ఏంటి, ఎలా చెయ్యాలో, ఆ ప్లేస్ కి తీసుకెళ్ళి చెప్తాను అని చెప్పింది. నేను ఎక్కడున్నానో మీకు ఫోన్ చేసి చెప్తాను. భయపడకండి." అని అబద్దం చెప్తుంది.

అమ్మ,

'.. ఏ ఫ్రెండ్? లావణ్య నా?'

ఫరీదా,

'కాదమ్మా! వేరే ఫ్రెండు! నేను వాళ్ళ ఇంటికి వెళ్లి మీకు ఫోన్ చేస్తా సరేనా?!.'

అమ్మ,

'సరే వెళ్ళు కానీ మేము ఫోన్ చేస్తే తొందరగా ఫోన్ ఎత్తు సరేనా?'

ఫరీదా,

'సరే అమ్మ! ఇక వెళ్తాను?'

నాన్న,

'ఆగు! వెళ్తాను కాదు! వెల్లోస్తను అనాలి! ఇవిగో ఈ డబ్బులు తీస్కో! దారి ఖర్చులకి డబ్బులు వద్దా ఏంటి? భోజనం కూడా ఏం తినలేదు నువ్వు!.'

ఫరీదా,

*మీరు తిట్టిన తిట్లకి ఆకలి సచ్చిపోయింది!*

' పర్లేదు నాన్న! ఇప్పుడు ఆకలి లేదు! ఆకలేస్తే బయట ఏమైనా కొని తింటాలే!'

తమ్ముడు,

"రాత్రి 2 ప్లేట్ల అన్నం తిన్నది కదా! ఇంక ఆకలేం ఉంటుంది? తిండి బోతుకి?"

ఫరీదాను తిడుతున్నా వాళ్లెవ్వరూ పట్టించుకోరు.

నాన్న,

'సరే! జాగర్తగా వెల్లి రా! ఫోన్ చేయటం మాత్రం మర్చిపోకు!'

ఫరీదా,

*నేను ఫోన్ చెయ్యాలంటే ముందు నా ఫోన్ లో బాలన్స్ ఉండాలిగా? 3 నెలల నుంచీ రీఛార్జ్ చేపించమని బ్రతిమాలుతున్నా సచ్చినోడు డబ్బులు దండగా అని చేపిలేదు. రోజుకి 100 mb వైఫై ఇస్తాడు! అంతే! అది కూడా కొన్ని సార్లు వచ్చి చావదు!*

'అలాగే అమ్మ, నాన్న, తమ్ముడూ...ఇక.. వెల్లి.. వస్తాను...'

కళ్ళ వెంట వచ్చే నీళ్లు దాచుకుంటూ బయలుదేర బోతుంది.

అమ్మ,

"ఒక్క నిమిషం ఆగు! నాన్న నీకు ఎంత ఇచ్చాడు? డబ్బులు సరిపోతాయా?"

ఫరీదా,

"200₹ ఇచ్చాడు."

అమ్మ,

"ఓ? అంతిచ్చాడా? వచ్చే తప్పుడు మార్కెట్ కు వెళ్లి 1కేజీ టమాటలు, ఉల్లిపాయలు, మిరపకాయలు, కుంచం అల్లం తీసుకురా. హా! కుదిరితే రెండు కొత్తిమీర, పుదీనా కట్టలు తీసుకొని రా. తమ్ముడికి బిర్యాని అంటే ఇష్టం కదా! వండుదాం!"

ఫరీదా,

"చాలా? ఈ 200₹ తో మార్కెట్ మొత్తం కోనేయ మంటావా?"

అమ్మ,

"హా? సరిపోతుంది! బస్లో వెళ్ళడానికి రావడానికి మొత్తం 40₹ అవుతుంది. 5₹కి ఒక పెద్దా కురుకురే పాకెట్ కొని కడుపు నిండా తిను. ఇంకా 155₹ మిగులుతుంది. ఆ మిగతా డబ్బులు ఏం చేసుకుంటావ్? నోరుమూసుకుని వచ్చే తప్పుడు చెప్పినవన్నీ పట్రా!"

ఇదా,

*ఫరీ...*

ఫరీదా,

*వద్దు! జాలి పడొద్దు! నా మీద నాకే అసహ్యం వేస్తుంది!*

కట్టు బట్టలతో అక్కడి నుంచి వేగంగా బయటకు వెళ్ళిపోయింది.

బయట ఉన్న టాప్ వాటర్ తో మొకం కడుక్కొని తన ఇంటిని చివరి సారిగా చూసి అక్కడి నుంచి బయలుదేరి నడుస్తూ వెళుతూ ఉంటుంది.

దారిలో తను రోజు మిద్ది పై నుంచి చూసే ఆ అబ్బాయి బైక్ దగ్గర కనిపిస్తాడు.

అతని చుట్టూ అతని పై కోపంతో రగిలి పోతున్న రెండు ప్రేతాత్మలను చూసి వాటిని తెలీకేనిసిస్ ద్వారా పిలుస్తుంది.

ఫరీదా,

'మీకు వాడికి ఏంటి సంబంధం?...'

అలా డైరెక్ట్ గా వాటిని ప్రశ్నలు అడగటంతో అవి ఫరీదా పైకి రాబోతాయి.

కానీ తనతో ఉన్న వాడి ఆత్మను గమనించి భయంతో కదలరు.

ఫరీదా,

*రేయ్ ఇదా! వీళ్ళు నా మాట వినట్లేదు! నీ పద్దతిలో విల్లని ప్రశ్నలు అడుగు~*

ఫరీద మాట విన్న తర్వాత, ఆ రెండు ఆడ దెయ్యాలు వాటికి తెలియకుండానే ఒక చీకటి ప్లేస్ లోకి టెలిపోర్ట్ అవుతాయి.

అవి దిక్కు తేలిక అక్కడి నుంచి తప్పించు కోవడానికి పరిగెత్తడం, అరిచి కేకలేయటం చేస్తూ ఉంటాయి.

చీకటి తో నిండి ఉన్న నేల లో నుంచి పొగ రూపం కలిగిన తీగలు బయటికి వచ్చి, ఆ రెండు ఆడ దెయ్యాలను గట్టిగా చుట్టి వేగంగా ఈడ్చుకొని ఒక సింహాసనం దగ్గర పడేస్తాయి.

అవి భయపడుతూ..

'ఎవరు నువ్వు! దయచేసి మమ్మల్ని వదిలేయ్... మా పగ తిరే వరకు-...'

ఆ చీకటిలో సింహాసనం పైన ఒక అబ్బాయి కూర్చొని ఉంటాడు. చీకటి వల్ల అతని మొఖం వాళ్లెవరికీ కనపడదు.

ఇదా,

'ష్... మీ సోది వినాలని నాకు ఏమాత్రం లేదు~'

అతను ఆ రెండు ఆడ దెయ్యాలను పురుగులను చూసినట్టు చూస్తూ ఉంటాడు.

ఇదా,

"మీ ఇద్దరు అన్నీ మూసుకుని, నా ఫరీ అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానాలు చెప్పండి! లేకుంటే.."

అని చెప్పి వెకిలిగా నవ్వుతూ ఉంటాడు.

ఇదా,

"దెయ్యాలను క్రూరంగా హింసించడం ఎలా అన్నది మీరిద్దరూ... మీ కళ్ళారా చూస్తారు~"

అని విలన్ లా నవ్వుతూ చెప్తాడు.

──•~❉᯽❉~•──

ఇంకా ఉంది...

ఇదా,

"హలో ఫ్రెండ్స్ నేను ఇదా!

నా ఫరీ ఫ్యామిలీ మెంబెర్స్ లాంటి వాళ్ళు మీ ఇంట్లో గానీ, మీ ఇంటి చుట్టు పక్కల గాని ఉన్నారా? అయితే వాడండి ఆల్ ఔట్! ఈ స్ప్రేని అలాంటి వాళ్ళ దెగ్గరకు రహస్యంగా వెళ్లి వాళ్ళ శంకల్లో కొట్టండి. వాళ్ళకు పట్టిన దూల తిరిపోతుంది. కికికికికికి.."

ఫరీదా,

"వాళ్ళకు దొరికావో నీకు కుక్క చావే! పిచ్చి కుక్కను కొట్టినట్టు వీధీ వీధీ తిప్పిచి, చెప్పుతో నీ ఒళ్ళంతా చెప్పట్లు కొడతారు."

ఇదా,

"....అయినా నా యుద్ధం మాత్రం ఆగదు! అలాంటి వాళ్ళను గుడ్లతో కొడదామా పేడతో కొడదామా అని అందరం కలిసి సూపర్ చాట్లో డిస్కషన్ పెడదామా?"

ఫరీదా,

"ఒరేయ్! ఏం చెయ్యమంటే ఏం చేస్తున్నావ్? నిన్ను దర్గాలో వదిలేయమంటావా ఏంటి?"

ఇదా,

"ఓకే! ఓకే బేబీ! అదే చెప్పబోతున్నా!

మీకు ఈ చాప్టర్ కనుక నచ్చినట్టయితే షేర్ చేసి, రేట్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ను ఫాలో చేసి సపోర్ట్ చెయ్యడం మాత్రం మర్చిపోకండి. 

అసలే వీళ్ళు మా ఫరీకు తిండి కూడా పెట్టట్లేదు! చూడండి ఎలా చిక్కి పోయిందో! మొన్న ఒకసారి దారిలో వెళుతుంటే ఒక ముసలావిడ కట్టె అనుకోని ఫరీదా చేతిని పట్టుకుంది."

ఫరీదా,

"నా పరువు తీయడం ఇంకా కాలేదా?"

ఇదా,

"అయిపొయింది! అయిపొయింది!

ఇక నెక్స్ట్ చాప్టర్ లో కలుద్దాం."

─── ・ 。゚☆: *.☽ .* :☆゚. ───


創作者的想法
farruarts farruarts

ఇదా,

"హలో ఫ్రెండ్స్ నేను ఇదా!

నా ఫరీ ఫ్యామిలీ మెంబెర్స్ లాంటి వాళ్ళు మీ ఇంట్లో గానీ, మీ ఇంటి చుట్టు పక్కల గాని ఉన్నారా? అయితే వాడండి ఆల్ ఔట్! ఈ స్ప్రేని అలాంటి వాళ్ళ దెగ్గరకు రహస్యంగా వెళ్లి వాళ్ళ శంకల్లో కొట్టండి. వాళ్ళకు పట్టిన దూల తిరిపోతుంది. కికికికికికి.."

ఫరీదా,

"వాళ్ళకు దొరికావో నీకు కుక్క చావే! పిచ్చి కుక్కను కొట్టినట్టు వీధి వీధి తిప్పిచి, చెప్పుతో నీ ఒళ్ళంతా చెప్పట్లు కొడతారు."

ఇదా,

"....అయినా నా యుద్ధం మాత్రం ఆగదు! అలాంటి వాళ్ళను గుడ్లతో కొడదామా పేడతో కొడదామా అని అందరం కలిసి సూపర్ చాట్లో డిస్కషన్ పెడదామా?"

ఫరీదా,

"ఒరేయ్! ఏం చెయ్యమంటే ఏం చేస్తున్నావ్? నిన్ను దర్గాలో వదిలేయమంటావా ఏంటి?"

ఇదా,

"ఓకే! ఓకే బేబీ! అదే చెప్పబోతున్నా!

మీకు ఈ చాప్టర్ కనుక నచ్చినట్టయితే షేర్ చేసి, రేట్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ను ఫాలో చెయ్యండి. కాయిన్స్ ఇచ్చి సపోర్ట్ చెయ్యడం మాత్రం మర్చిపోకండి.  అసలే వీళ్ళు మా ఫరీకు తిండి కూడా పెట్టట్లేదు! చూడండి ఎలా చిక్కి పోయిందో! మొన్న ఒకసారి దారిలో వెళుతుంటే ఒక ముసలావిడ కట్టె అనుకోని ఫరీదా చేతిని పట్టుకుంది."

ఫరీదా,

"నా పరువు తీయడం ఇంకా కాలేదా?"

ఇదా,

"అయిపొయింది! అయిపొయింది!

ఇక నెక్స్ట్ చాప్టర్ లో కలుద్దాం."

next chapter
Load failed, please RETRY

每周推薦票狀態

Rank -- 推薦票 榜單
Stone -- 推薦票

批量訂閱

目錄

顯示選項

背景

EoMt的

大小

章評

寫檢討 閱讀狀態: C3
無法發佈。請再試一次
  • 寫作品質
  • 更新的穩定性
  • 故事發展
  • 人物形象設計
  • 世界背景

總分 0.0

評論發佈成功! 閱讀更多評論
用推薦票投票
Rank NO.-- 推薦票榜
Stone -- 推薦票
舉報不當內容
錯誤提示

舉報暴力內容

段落註釋

登錄