రాత్రి వేళ సమయం. ఆకాశంలో నక్షత్రాలు మిల మిల మంటూ అందంగా మెరుస్తున్నాయి.
నెల్లూరు నగరంలోని స్ట్రీట్ లైట్స్ వెలిగీ వెలగనట్టు కొట్టుకుంటున్నప్పుడు వెన్నల వెలుగు చుట్టు ఉన్న చీకటిని నింపేసింది.
చలనం లేని ఖాళీ రోడ్డులో ఒక వ్యక్తి గాయాలతో నడుస్తూ వెళుతూ ఉంటాడు.
అలసటతో ఒక గోడకు అనుకుంటాడు.
భైరవ: హా... ఫ్... హ్ఫ్... ఛా! నా పరిస్థితి చూడు ఎలా అయిపోయిందో.. హా..
గుంపుగా వచ్చి నన్ను చితకొట్టేశారు. వాళ్ళందరూ కనుక ఒంటటిగా ఉండుంటే నా సామి రంగా! ఒక్కొక్కడిని మక్కెలిరగ దన్నేటోడిని!.."
నా సమయాన్ని వృధా చేయకుండా నా శక్తులని త్వరగా రికవర్ చేసుకోవాలి!
ఇలాగే పరిగెడుతుంటే నేను రికవర్ అవ్వడం అసాధ్యం.
నేనున్న పరిస్థితిలో వాళ్ళకు సులభంగా దొరికిపోతాను.
ఎలాగైనా ఇక్కడి నుంచి దూరంగా పారిపోయి త్వరగా హీల్ అవ్వాలి.
దానితో పాటుగా నా అడుగుజాడలను మాయం చేసేయాలి.
అతను నడుస్తూ వెళుతుండగా రోడ్డు పక్కన చెత్త కుండీ దెగ్గర ఒక పిల్లి ఆవిలించి కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది.
..పిల్లి?
...ఆలోచన వచ్చింది!.
పిల్లి అతన్ని ఆసక్తి లేకుండా చూస్తుంది.
ఆ ప్రదేశంలో పెద్దగా వెలుతురు వస్తుంది.
*****
డిపార్ట్మెంటల్ స్టోర్లో షాపింగ్ చేస్తుండగా,
సవ్యసాచి: వావ్!...
బ్రాండెడ్ కాట్ ఫుడ్ చాలా తక్కువ ధరకే అమ్ముతున్నారు.
మాములుగా ఈ కాట్ ఫుడ్ కొనాలంటే చాలా ఖర్చు అవుతుందని కొనలేక పోయే దాన్ని.
ఇప్పుడు తక్కువ ధరకే అమ్ముతున్నారు కాబట్టి సెట్లు కొని స్టోర్ చేసుకోవాలి.
ఓహ్! ఇది కూడా అమ్ముతున్నారా? కిందటి సారి స్టాక్ అయిపోయింది. కొనలేక పోయాను.
వహ్! ఇది కొత్త స్టాక్!
నా పిల్లులు వీటిని కచ్చితంగా ఇష్టబడుతాయి. వీటిని కొనాలా?
వద్దులే. ఇవి కొత్త రకం కాట్ ఫుడ్డు కదా వాటికి నచ్చవేమో. ఇంకోసారి వచ్చినప్పుడు కొందాం.
నా దెగ్గర పిల్లులకు పెట్టడానికి స్నాక్స్ అన్నీ అయిపోయాయి. ఇవి కూడా కోనేద్దాం.
వావ్! పిల్లులు ఆడుకునే ఆట వస్తువులా? దీనికి చాలా మంచి రేటింగ్స్ ఉన్నాయి. కొందామా వద్దా?
నాకు చాలా వస్తువులే కొనాలని ఉందే.. ఇప్పుడేం చెయ్యను?..
ఆహ్! ఇక ఆలోచించడం నా వల్ల కాదు! అన్నిటినీ ఒక్కొక్కటిగా కొని పడేద్దాం!
సవ్యసాచి అన్నిటినీ కొంటుంది.
షాప్ ఓనర్ సంతోష పడుతాడు.
సవ్యసాచి: అబ్బబ్బా.. నా కోసం వస్తువులు కొందామని అనుకుని వస్తే అది మర్చిపోయి ఎప్పటిలాగే పిల్లులకే డబ్బులను ఖర్చు పెట్టేసాను.
ఈ నెలంతా ఏం చెయ్యాలో ఏంటో..
పర్లేదులే! నేను కొన్న కాట్ ఫుడ్డు నా పిల్లి పిల్లలకు బాగా నచ్చుతుంది. అదే ముఖ్యం."
సవ్యసాచి నడుచుకుంటూ వెళ్లి రోడ్డు పక్కన సిగ్నల్ దెగ్గర నిలబడుతుంది.
రెడ్ సిగ్నల్ పడటంతో అందరిలా సిగ్నల్ దెగ్గర నిలబడి గ్రీన్ సిగ్నల్ పడే వరకు ఎదురు చూస్తూ ఉంటుంది.
జీబ్రా క్రాసింగ్ దెగ్గర ఒక బాబు బంతితో ఆడుకుంటూ ఉంటాడు. వాళ్ళమ్మ ఫోన్ లో బిజీగా ఉండుంటుంది.
తన బంతితో ఆడుకుంటూ ఉండగా అది ఎగురుకుంటూ వెళ్లి రోడ్డు మధ్యలోకి వెళ్లి పడుతుంది.
బాబు బుడి బుడి అడుగులతో పరిగెట్టుకొని వెళ్లి ఆ బంతిని చేతిలోకి తీసుకుంటాడు.
సవ్యసాచి: హహ్?..
సవ్యసాచి అది గమనిస్తుంది. బాబు ఎదురుగా వేగంతో ఒక కార్ వస్తూ ఉండుంటుంది.
సవ్యసాచి: అయ్యయ్యో!..
కారు బాబుని గుద్దడానికి క్షణం ముందు సవ్యసాచి వేగంగా పరిగెట్టుకొని వెళ్లి కాపాడి రోడ్డు పక్కన ఆగుతుంది.
కారు డ్రైవర్ పిల్లాడిని గమనించి స్కిడ్ కొట్టి కారును పక్కకు ఆపుతాడు.
సవ్యసాచి: హఫ్... హఫ్... హఫ్...
ఆమె గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఉంటుంది.
బాబు: హా?.. నా బంతి?..
అని చెబుతూ ఏం జరిగిందో తెలియక తికమక పడుతూ ఉండుంటాడు.
సవ్యసాచి: బాబు? నీకేం కాలేదుగా? దెబ్బలేం తగల్లేదుగా? బానే ఉన్నవుగా?"
అని కంగారుపడుతూ అడిగి పిల్లాడిని పరీక్షిస్తుంది.
బాబు: హహ్?.. నాకేం కాలేదు అక్కా.."
అని చెప్పి తికమక మొఖం పెడతాడు.
సవ్యసాచి: నీకు దెబ్బలేం తగల్లేదు. కానీ ఇంకెప్పుడు రోడ్డు దెగ్గర ఆడుకోకుండా జాగర్తగా ఉండు. సరేనా?"
అని కంగారు పడుతూ చెబుతుంది.
బాబు: స.. సరే అక్కా."
అని కంగారుతో తల ఊపుతాడు.
"నువ్వు చూసావా?"
"హహ్?.."
"ఒక బాబుని కారు గుద్దబోయింది. సడెన్గా రోడ్డు మధ్యలో ఉన్న బాబు మాయమై పోయాడు."
"నేను కూడా చూసాను.. అసలేం జరిగింది?.."
"అక్కడ ఉన్న బాబు ఏమయ్యాడు?.."
అని మాట్లాడుతూ ఉండుంటారు.
దూరం నుంచి బాబు వాళ్ళ అమ్మ కంగారు పడుతూ పిలుస్తూ వెతుకుతూ ఉంటుంది.
"రే పండు!? ఎక్కడికెళ్లావ్రా?.."
బాబు: మమ్మీ.. ఇక్కడున్నాను!.."
సవ్యసాచి: అ-ఓ.. బాబు! ఇక బయలుదేరుతా! జాగర్త!..
అని చెప్పి సవ్యసాచి అక్కడి నుంచి బయలుదేరుతుంది.
సవ్యసాచి: ఈ శక్తి నాకుండటం నా అదృష్టం..
దీనివల్లే ఆ బాబు ప్రాణాలు కాపాడగలిగాను..
బాబు అమ్మ: పండు! నీకేం కాలేదుగా? నేనెంత భయపడ్డానో తెలుసా?!
ఆ కారు నిన్ను గుద్దేయబోయింది! నా గుండె ఆగినంత పనయ్యింది!! మంచిదయింది నీకేం కాలేదు! ఎలా కారు నుంచి తప్పించుకున్నావ్?..
అని కంగారు పడుతూ అడుగుతుంది.
బాబు: తెలీదమ్మా!.. ఆ అక్క నన్ను కాపాడింది."
అని చెబుతూ సవ్యసాచి వైపుగా చూపిస్తాడు.
బాబు అమ్మ: అక్కా? ఏ అక్క?.."
బాబు: హహ్?.."
బాబుకి అక్కడ సవ్యసాచి కనబడదు. ఆమె అక్కడి నుంచి దూరంగా నడుచుకుంటూ వెళ్లి పోతుంది.
బాబు ప్రమాదంలో ఉన్నాడనే నా శక్తిని ఉపయోగించాను..
ఉఫ్.. కుంచముంటే మామూలు ప్రజలకు దొరికి పోయేదాన్ని..
అయినా, బాబుకి గాయాలు తగలక ముందే నేను కాపాడగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
అని ఆలోచిస్తూ ఆనందంగా ఇంటికి వెళుతుంది.