Tải xuống ứng dụng

Chương 2: 2

──•~❉©Farruarts©❉~•──

నా పేరు ఫరీద. నా వయసు 21 సంత్సరాలు.

నేను నా చిన్నప్పటి నుంచి ఆత్మలను, ప్రేతత్మలను పొగ రూపం లో చూడగలను, వాటితో మాట్లాడగలను.

నేను ఎప్పుడు బయటకు వెళ్లినా నాకు మొదట కనిపించేవి ఈ పొగ రూపాలే.

గుడి బయట ప్రేతత్మాలు తిరిగేవి. గుడి లోపల మామూలు ఆత్మలు సంచరించేవి. వీటికి దేవతలంటే అస్సలు నచ్చవు. ఎప్పుడూ దేవతలను తిడుతూనే ఉండేవి. వాటి తిట్లు విని నా చెవులు చిల్లడేవి.

కానీ గుడి లోపల మాత్రం మనుషులతో పాటుగా ఆత్మలు కూడా దేవుడి దర్శనం చేసుకొని అక్కడే భక్తిలో లీనమయి ఉండేవి. నేను అప్పుడప్పుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కథలు వినేదాన్ని. వీళ్ళలో దేవతలను కళ్ళారా చూసి వాళ్ళతో సమయాన్ని గడిపిన ఆత్మలు కూడా ఉన్నాయి.

చర్చ్ లలో ఆత్మలు మాములుగా తిరిగేవి. కానీ దేవుడి బొమ్మ ముందుకు మాత్రం ఏ దెయ్యమూ వెళ్ళేది కాదు.

మసీద్ లోపల మాత్రం అలా కాదు. ఎప్పుడు చూసినా యుద్ధ వాతావరణమే! దెయ్యాలు మాత్రమే కనిపించేవి. వాళ్లలో ఆత్మలు కూడా ఉన్నా, ఈ దెయ్యాలు రాగింగ్ చేసి ఆత్మలను తరిమెసేవి. పాపం.

నేను ఎప్పుడు బయటికి వెళ్లినా గుడ్లలోనూ, చర్చ్, మసీదుల లోనూ కనిపించే దెయ్యాలు, ఆత్మలు ఉండటం చూసి వాటిని బాగా పరిశీలించాకా నాకు తెలిసింది ఏమిటంటే అన్ని ఆత్మలలో నాలుగు రకాలు ఉన్నాయి.

1) మామూలు ఆత్మలు, దూతలు: తెల్లటి రూపం గల ఆత్మలు: ఇవి శాంతి పూర్వకమైన ఆత్మలు. ఇవి శాకాహార జీవుల్లాంటివి. వాటికి కోపం తెప్పించేంత వరకు ఎవరికి హానీ చెయ్యవు. వారి ప్రియమైన వ్యక్తిని అంటి పెట్టుకొని పక్కనే ఉంటూ కాపాడుకుంటూ ఉంటాయి. దూతలు ఏమో బంగారు రంగులో ఉంటాయి. వీటి జోలికి వెళ్ళకూడదు.

2) దెయ్యాలు: నల్లటి పొగ కలిగిన ఆత్మలు: కోపం, క్రోధం, పగ తో పాటు కుంచం క్రూరంగా ఉండే ఆత్మలు..  ఇవి సర్వభక్షక ఆత్మలు. అటు మంచివి కావు, ఇటు చెడ్డవి కావు. అవి పగా ప్రతీకారం అంటూ వేరొకరిని పీడిస్తూ ఉంటాయి. కానీ కొన్ని సార్లు మొండి చేసినా వాటికి జరిగిన అన్యాయానికి ధర్మం ఎక్కడంటూ అందరినీ అడిగి వారిని నిలదిస్తాయి.

3) భూత ప్రేత పిశాచాలు: ఇవి ఎర్రటి పొగ కలిగిన ఆత్మలు. ఇవి సామాన్య మనుషుల ఆత్మలు కావు. ఇతర ఆత్మలను పీల్చేస్తాయి. వీటినే వాడుకొని మనుషులు చేతబడులు చేసి డబ్బులు సంపాదించుకుంటారు. వీటికి ఇతరులను హింసించి చంపడం తప్పా వేరే ఆలోచనే ఉండదు. ఇవి మాంసాహార ఆత్మలు.. కాదు... ప్రేతాత్మలు.. పిశాచాలు.. వీటికి దొరికావో నీలోకి దూరి వాటిని అవే హింసించుకొని ఆ హింసను ఆస్వాదిస్తాయి.

అబ్బాయిలు సిగరెట్ పీల్చినట్టు నీ ప్రాణ్ణన్ని పీల్చేస్తాయి.

ఇవి వాటి స్వార్థం కోసం ఏమైనా చేస్తాయి. ఎంతకయినా తెగిస్తాయి.

హింస అన్నా హింసను ఆస్వాదించే వాళ్ళన్న వీటికి అమితమైన ప్రేమ. వీటి చేతికి చిక్కితే పిల్లి చేతికి దొరికిన ఎలుక గతి లాగా మారుతుంది. అడుకొని, హింసించి చంపుతాయి.

కానీ నేను గమనించిన నాలుగో రకం, పైన మూడులా ఏ మాత్రం కావు.

4) నీలం, ఎరుపు, నలుపు లాంటి మూడు రంగులు కలిగి ఉన్న  ఆత్మలు. ఇవి ఏంటో ఎలాంటివో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు.

వీటిని చూసి ఆత్మలు గజ్జి కుక్కను చుసినట్టుగా ఛీ కొట్టి దూరంగా వెళ్ళిపోతాయి.

దెయ్యాలు భయంతో గుండాలను చుసినట్టు దూరంగా పారిపోతాయి.

భూత ప్రేత పిశాచాలు పాంట్లో పాస్ పొసేస్తాయి.

పురాతన గ్రంధాల ప్రకారం చూస్తే ఇవి దేవతలకూ, రాక్షసులకూ క్రాస్ బ్రీడింగ్ చేయటం వల్ల పుడతాయని తెలిసింది. ఇవి బయట చాలా అరుదుగా కనిపిస్తాయి.

వీటిని నేను స్పష్టంగా చూడగలనని పై మూడు రకాల ఆత్మలకు కూడా తెలుసు. కానీ, నా దగ్గరకు రావటానికి అవి కనీసం దైర్యం కూడా చెయ్యలేవు.

ఎందుకంటే..,

'కికికికికికి... నీ శరీరం నాకు కాసేపు ఇవ్వొచ్చుగా.. కాసేపు అడుకొని తర్వత తిరిగి ఇచ్చేస్తాను.. కికికి...'

వీడి వల్లే...

ఫరీదా,

'నోరు ముస్కో! లేకుంటే నిన్ను దర్గాలో వదిలేస్తా. అప్పుడు గానీ నీకు తిక్క ఒదలదు.!'

ఆ ప్రేతాత్మ నవ్వుతూ,

'కికికికికికి... నువ్వు ఎప్పుడు నా మాట విన్నావని~ ఊరికే బుసలు కొడుతూ ఉంటావు.. నీటి పాములాగ~'

వీడే ఆ మూడు రంగులు కలిగి ఉన్న ఆత్మ! కాదు! ప్రేతాత్మలను సైతం కాళ్ళ కింద వేసి తొక్కి ఆడుకునే వాడు.

వీడికి నేను పెట్టిన పేరు "ఇదా"

వీడు నాతో చిన్నప్పటి నుంచి ఉండటంతో వీడికి నా పేరులో సగం పేరు పెట్టుకున్నాను.

ఇదా,

'ఫర్రు బేబీ....."

వాడు నన్ను ఫరీ లేదా ఫరూ అని వాడి  మైండ్సెట్ బట్టి పిలుస్తాడు. కానీ అప్పుడప్పుడు బేబీ అని లవర్ని పిలిచినట్టు పిలుస్తుంటారు. వాడు అలా పిలిచినప్పుడల్లా నాకు ఒళ్ళంతా పురుగులు, జెర్రిలు పాకినట్టు కంపరంగా అనిపిస్తుంది. ఏం చెయ్యను నాకు తప్పట్లేదు.

ఇది ఎవరి ప్రేతాత్మో నాకు తెలీదు. కానీ ఇది నా చిన్న వయసు నుంచి నాతోనే ఉంది.

అప్పటి నుంచి నాతో నవ్వుతూ ఆడుకునే వాడు, వీడివల్ల నేను ఎన్నో ప్రమాధాల నుంచి తప్పించుకున్నాను. చాలా సార్లు తిట్లు కూడా తిన్నాను. వీడి వాళ్ళ మా అమ్మ నాన్నల చేతుల్లో నేను తిన్న దెబ్బల గురించి చెప్పనక్కర్లేదు.

ఇదా,

'ఫర్రు! ఈ రోజు టిఫిన్ ఏంటి?.. బిర్యాని నా? చికెన్ నూడుల్స్ ఆ?."

వీడితో ఉండటం అంటే మొదట్లో నాకు భయం వేసేది. కానీ, నాకు అలవాటు అయిపోయింది.

ఫరీదా చిరాకు పడుతూ,

"ఇడ్లీ!"

ఇదా,

'హా?ఎప్పుడు చూసినా ఇడ్లీ ఏనా?...'

నాకూ నా శరీరానికి ఎప్పుడూ హానీ చెయ్యలేదు.

ఫరీదా,

*అయ్యగారికి మరి ఇంకేం కావలి?*

ఇదా,

'హా.... నాకు బిర్యానీ కావాలి!!!'

కానీ చాలా అల్లరిది, మొండిది.

ఫరీదా,

*మన మొఖాలకి వీళ్ళు తిండి పెట్టడమే ఎక్కువ! పొద్దున్నే బిర్యాని అడిగాననుకో నన్ను మెడ బట్టుకొని బయటకు గెంటేస్తారు. అప్పుడు బిక్క మొకం వేసుకొని నువ్వూ నా వెనకే వస్తావు.*

మాములుగా దెయ్యాలు గుడి, చర్చ్, మసీద్ లకు కుంచం దెగ్గరగా వెళ్ళాలన్నా భయంతో తడబడుతాయి.

వీడితో చర్చ్కు , గుడికి, దర్గాలకు వెళ్ళినా వాడికీ నాకూ ఎప్పుడూ ఏమి అనిపించలేదు.

అంతెందుకు గుడ్లలో వెళుతూ ఉన్న అమ్మాయిలను చూసి జొళ్లు కార్చుకుంటూ ఉంటాడు.

బహుశా సినిమాల్లో దెయ్యాల గురించి చూపించేది అంతా సుత్తేనేమో..

ఇదా,

*నాకు బిర్యాని పెట్టనంటే ఇక్కడి నుంచి దూకేస్తా!*

ఫరీదా,

*హా? పో దూకు! నువ్వు నాలా మనిషివి కావు! దూకగానే దెబ్బలు తగులుతయేమోనని బాధ పడడానికి~ దెయ్యం గాడివి! అయినా వీళ్ళు నాకు ఇడ్లీ పెట్టడమే ఎక్కువ! బిర్యానీ అడిగాననుకో కట్టు బట్టలతో ఇంటి నుంచి దొబ్బే అంటారు! పర్లేదా?*

దెయ్యాలకు గుడి, దర్గా, చర్చ్ ల పేర్లు వింటేనే భయంతో వనుకుతాయి.

ఇదా,

*పదా! గుడికి వెళ్లి అక్కడ పులిహోర, ప్రసాదం ఏమైనా తిందాం!*

కానీ ఇదా అసలు భయపడడు ఎందుకో?!

ఫరీదా,

*సరే! నాకు తప్పుద్దా!?*

నేను ఎప్పుడూ బయటికి వెళ్ళినా, అందమైన అబ్బాయిలకు అమ్మాయిలు ఎలా అయితే సైట్ కొడతారో అలా వీడికి కొన్ని ఆడ దెయ్యాలు సైట్ కొడుతూ ఉంటాయి.

ఫరీదా చిరాకు పడుతుంది,

*కర్మ రా బాబు!*

ఇదా అన్నీ దిక్కులూ చూస్తూ స్టైల్ గా నడుస్తూ ఫరీదా వెనుక వస్తూ ఉంటాడు.

దెయ్యం #1,

'అబ్బా! వాడు చూడు హీరో మహేష్ బాబు లా ఉన్నాడు!'

దెయ్యం #2,

*అబ్బా! అవునే! ఎంత హాట్ గా ఉన్నాడో!*

ఫరీదా,

*హా? వీడేమో మహేష్ బాబు! ఆవిడేమో నమ్రతా! సరిపోయింది.*

ఇదా,

*నీకు నా ఫాలోయింగ్ చూసి కుళ్ళు!*

ఫరీదా,

*వచ్చాడండి! కలికాలంలో కృష్ణుడు! నోర్ముసుకొని పదా!*

ఇదా,

*కికికికికికి!*

అలా దారిలో వెళుతూ ఉండగా,

దెయ్యం #2,3,4,...,

'అబ్బాబ్బా! మనం బ్రతికే ఉంది అంటే ఒక పట్టు పట్టెటోల్లం! కికికికికికి....'

ఫరీదా,

*ఈ దరిద్రం వినడానికా నేను ఇంకా బ్రతికుంది? ఛీ! నా జీవితం!*

ఇదా,

*కికికికికికి.. ప్రతీ కుక్కకీ ఒక రోజు వస్తుందంటారు-*

వాడి మాటలకు అడ్డుపడి,

ఫరీదా,

*-ఇది నీ రోజేలే! పదా!*

నా శరీరంలోకి దూరి చాలా అల్లరి చేసేది ఆ తర్వాత దాని గోల భరించలేక ఇద్దరం ఒక మాటకు ఒప్పుకున్నాం..

ఫరీదా,

'నాకు ఈ దెయ్యాల మాటలు వింటుంటే ఒళ్ళంతా కంపరంగా ఉంది.'

ఇదా,

'పర్లేదులే బేబీ! నువ్వుండగా నేను ఎవరికీ సైట్ కొట్టనులే! కికికికికికి...'

ఫరీదా చిరాకు పడుతుంది,

'నార్ముయ్ చేత్తెదవ!'

వీడు చాలా పవర్ఫుల్. వీడి రిక్వెస్ట్ ప్రకారం

అవసరం వచ్చినప్పుడు నా బాడీ వాడికి ఇవ్వాలి.

మా ఇద్దరి కాంట్రాక్టు ప్రకారం,

1) ఎవరికీ మా కాంట్రాక్టు గురించి చెప్పకూడదు.

2) నా పర్మిషన్ లేకుండా హత్యలు చేయకూడదు. మనిషి, జంతువు, పక్షి... ఎవరికీ హాని చెయ్యకూడదు.

3) నస పెట్టకూడదు..

4) ఆడ దెయ్యాలతో సోది పెట్టకూడదు..

5).......

X) ఎక్కువ అల్లరి చేయకూడదు.

గుడికి చేరుకున్నాక ఇదా నా శరీరంలోకి దురుతాడు. నేను నా శరీరం నుండి బయటకు వచ్చి నా ఆత్మ బాలూన్ లా గాల్లో తేలుతూ ఉంటుంది.

ఇదా చుట్టు పక్కలకు వెళ్లి తిరుగుతూ గుడ్లో ప్రసాదం కోసం లైన్లో నిలబడి ప్రసాదం తెచ్చుకొని తింటూ ఉంటాడు.

ఫరీదా,

*అలా తినకురా బాబూ! ఎవరయినా చూస్తే నన్ను వరద బాధితురాలని అనుకుంటారు.*

ఇదా ఒక పెద్ద ప్లేట్ నిండా గుడి ప్రశాదాన్ని నింపుకుని చేతినిండా అన్నం తీసుకొని నోట్లో కుక్కుకుని తింటూ ఉంటాడు,

*వాళ్ళు ఎప్పుడూ ఏదోకటి అనుకుంటూనే ఉంటారు! ఎవరు ఎలా అనుకుంటే మనకెందుకు ఫరీ? నీకు నేను అన్నం తినే పద్దతి నచ్చ లేదా? చెప్పు! మార్చుకోవడానికి ట్రై చేస్తా! ఓకేనా?*

ఫరీదా,

*సరే! నీకు నచ్చినట్టు తిను! అప్పటి దాకా నేను వెళ్లి గుడి చుట్టూ కొన్ని రౌండ్లు వేసి వస్తా!!!* అంటూ గాల్లో తేలుతూ వెళుతుంది.

ఈ విధంగా అప్పుడప్పుడు మేము బట్టలు మార్చుకునట్టు శరీరం మార్చుకుంటూ ఉంటాం.

మా ఇద్దరికీ, నాకు రోజూ వచ్చే కలకి ఏదో సంబంధం ఉందని నా అనుమానం.

ఫరీదా ఆత్మ అలా గాల్లో తేలుతూ ఉండగా ఆమెను చాలా ఆత్మలు పలకరిస్తాయి.

ఆత్మ,

*ఫరీదా పాపా! వచ్చావా? నిన్నే గుర్తు చేసుకుంటూ ఉన్నాను! నువ్వే కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యావు!* అంటూ నవ్వుతూ పలకరిస్తాడు.

ఫరీదా అతన్ని చూసి నవ్వుతూ చెయ్యి ఊపి దెగ్గరకు వెళ్లి అతని పక్కన కూర్చుంటుంది.

ఫరీదా,

*హిహిహిహిహి... హాయ్ ఫ్రెండు♡! ఏం చేస్తున్నావ్?* అంటూ నవ్వుతూ మాట్లాడుతుంది.

అతను నవ్వుతూ ఆమె తలను నిమురుతూ ఆకాశంలోకి చూస్తాడు.

ఆత్మ,

*ఏముందిరా~ నా గతం గురించి గుర్తు చేసుకుంటూ నా జీవితంలో జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నాను.*

ఫరీదా,

*ఓ.. ఇంతకీ నువ్వు ఎప్పుడు చనిపోయావు ఫ్రెండు?*

అతను ఫరీదా అమాయకత్వాన్ని చూసి చిరునవ్వు నవ్వుతాడు.

ఆత్మ,

*నేను చనిపోయి చాలా కాలమే అయింది రా~*

ఫరీదా,

*అంటే ఏ కాలం ఫ్రెండు?*

ఆత్మ,

*ఎంత కాలమో సరిగ్గా తెలీదు కానీ, నేను ఒక యుద్ధంలో చనిపోయాను.*

ఫరీదా,

*ఓ... బహుశా.. వోర్ల్డ్ వార్2 అప్పుడా? లేదా దాని తర్వాత కాలంలో ఇండియా బార్డర్ లోనా??*

అతను ఫరీదాను చూసి రెండూ కావని తల ఊపుతాడు.

ఫరీదా,

*మరి ఇంక ఎప్పుడు ఫ్రెండు? వోర్ల్డ్ వార్1 అప్పుడా??*

అతను ఆకాశం లోకి చూస్తూ గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి చిరునవ్వు నవ్వుతాడు.

ఆత్మ,

*కురుక్షేత్ర యుద్ధంలో..*

ఫరీదా అతని సమాధానం విని భీభత్సంగా ఆశ్చర్య పోతుంది. ఫరీదా ఆశ్చర్యంతో నిశ్శబధంగా నోరు బార్ల తెరుస్తుంది. అతను ముసిముసి నవ్వులు నవ్వుతూ అతని చేతి వేలుతో మెల్లగా ఆమె నోరు ముస్తాడు.

ఫరీదా,

*క-క-క-కు-కు-కురు-కురుక్-... కురుక్షేత్రం లోనా?? తమాషాలు చేయ్యకు ఫ్రెండు! నువ్వు నీళ్ళ కోసం ఏ ఆంటీ చేతిలోనో బిందెతో తన్నులు తిని చనిపోయానని చెప్పినా నిన్ను నేను వెక్కిరించను! సిరియస్ గా నిజం చెప్పు ఫ్రెండు!* అని అతన్ని అమాయకంగా చూస్తుంది.

అతను ఆమె చిలిపి మాటలు విని పకపకా నవ్వుతాడు.

ఫరీదా,

*హ?... నన్ను ఆట పట్టిస్తున్నావా?* అంటూ అలుగుతుంది.

అతను నవ్వాపుకుంటూ ఆమె తల మీద చెయ్యి పెట్టి జుట్టుని నిమురుతాడు.

ఆత్మ,

*నా ఫ్రెండ్ కీ నేను అబద్దం చెప్తానా? హ్మ్? నేను చెప్పింది నిజమే!* అంటూ ఆమెను చూసి నవ్వుతాడు.

ఫరీదా,

*సరే~ నువ్వు చెప్పింది నిజమేనని నమ్ముతా! మరి నువ్వు చనిపోక ముందు నీ అసలు పేరు ఏంటి?*

ఆత్మ,

*నన్ను చాలా పేర్లతోనే పిలుస్తారు! కానీ అందరికీ ఎక్కువగా తెలిసిన నా పేరు కర్ణ!*

ఈసారి అతని సమాధానం విని అశ్చర్యం తో ఫరీదా బుర్రలో ఉన్న మట్టంతా వదిలి పోతుంది.

ఫరీదా,

*కర్ణ? అంటే టీవీ సీరియల్స్లో కథల పుస్తకాల్లో చూపించే కర్ణ?* అతను అవునని తల ఊపుతాడు.

ఫరీదా,

*అంటే... దాన-వీర-సూర-కర్ణ? నువ్వా?*

అతను మొహమాట పడుతూ,

*అవునమ్మా!..*

ఫరీదా,

*మరి అప్పుడు నీ పేరేంటని అడిగితే నాతో వాసు అని చెప్పావ్?*

ఆత్మ,

*అది కూడా నా పేరే కదా అని చెప్పాను.. ఏమ్మా?*

ఫరీదా,

*మహాభారతం సీరియల్ లో నా ఫేవరెట్ చారెక్టర్ ఏ కర్ణుడు. ఇప్పుడు ఒరిజినల్ కర్ణుడే నా ముందు నా పక్కన కూర్చొని ఉంటే, అసలు నాకు ఎలా ఫీల్ అవ్వాలో అర్థం కావట్లేదు! నేను ముందే అనుకున్నా! నువ్వు ఇంత పొడుగ్గా అందంగా ఉన్నప్పుడే నువ్వు ఏ కాలంలోనో మహారాజువో లేదా ఒకప్పటి సినిమా హీరోవో అనుకున్నా! కానీ కర్ణుడివని అస్సలు అనుకోలేదు! ఇంతకీ నువ్వు ఎవరో ఇక్కడి ఆత్మలకు తెలుసా?* అతను లేదని తల ఊపుతాడు.

ఫరీదా సడెన్గా నిరుత్సాహ పడుతుంది.

ఫరీదా,

*పాపం నువ్వు! అందరూ కలిసి నువ్వు అమాయకుడివని తెలిసి కూడా నమ్మించి మోసం చేసి అన్యాయంగా చంపేశారు. వాళ్ళందరూ అలా చేసినందుకు నీకు చాలా బాధగా ఉంది కదూ?*

ఆత్మ,

*లేదమ్మా! నాకు మరణం సంభవిస్తుందని తెలిసే గతంలో అలా చేసాను. నాకు బాధగా లేదు. నాకోసం నువ్వు దిగులు పడకు.*

ఫరీదా,

*మరి.. చనిపోయిన తర్వాత మళ్ళీ పునర్జన్మ ఎత్తుతారంటారు కదా!? మరి అప్పటి నుంచీ నువ్వు ఇలాగే ఆత్మలా ఎందుకు ఉన్నావు?*

ఆత్మ,

*నేను కూడా ఆ ప్రశ్నకు సమాధానం కోసం ఇంతకాలం ఎదురు చూస్తూ ఉన్నానమ్మా.*

ఫరీదా అతని చేతిని పట్టుకొని నిమురుతుంది,

*నువ్వు పునర్జన్మ ఎత్తితే నిన్ను ప్రేమగా చూసుకుని నిన్ను అంటి పెట్టుకొని ఉండే తల్లితండ్రులు, నీకు అన్నింట్లోనూ తోడుగా ఉండే తొడబుట్టువులూ, కల్మషం, స్వార్థం లేని స్నేహితులూ, నిన్ను అర్థం చేసుకునే భార్యాపిల్లలు దొరకాలని అన్నీ దేవుడ్లనూ కోరుకుంటున్నాను!*

అతను ఆమె మాటలు విని చాలా ఆనందిస్తాడు.

ఆత్మ,

*నువ్వు చెప్పినట్టుగా జరిగితే ఎంత బాగుండు.. ప్రస్తుతానికి నాకు కల్మషం, స్వార్థం లేని స్నేహితురాలు ఉంది అది చాలు!* అని నవ్వుతాడు. ఫరీదా కూడా ఆనందంతో నవ్వుతుంది.

అలా కాసేపు వాళ్లిద్దరూ మాట్లాడుకున్న తరువాత ఇదా తో కలిసి ఇంటికి వెళుతుంది.

కొన్ని రోజుల తరువాత,

ఫరీదా పొద్దున బాత్రూంలో స్నానం చేస్తూ ఎడమ చేతి వైపు చూస్తూ ఉంటుంది.

నాకు అంతు చిక్కని రహస్యాలలో మరొకటి,..

నా ఎడమ చేతి పైన నిప్పుల చుట్టు ఉన్న సింహం బొమ్మ, ఇంకో వైపు నీళ్ల చుట్టు ఉన్న డ్రాగన్ బొమ్మ గల టాటూ.

ఇది నా కళ్ళకు తప్ప ఎవరికీ కనిపించదు.

ఈ టాటూ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా చేతి పైన ఉంది.

టాటూ లోని బొమ్మలు కదులుతుంటాయి కూడా..

స్నానం పూర్తి చేసి బట్టలు వేసుకొని బయటకి రాబోతున్న సమయంలో ఒక నల్లటి సుడి గుండం గాలి లో ఏర్పడుతుంది. దాని ఆకారం వేగంగా పెద్దగా మారుతుంది. అది చూడటానికి అచ్చం బ్లాక్ హోల్ లా ఉంటుంది.

ఫరీదా,

'...బ్లా-బ్లాక్ హోల్?..'

బ్లాక్ హోల్ లోపలి నుంచి ఒక ఎర్రటి వెలుగు గల పుర్రె కలిగిన కట్టెను చేతిలో పట్టుకొని ఒక దెయ్యం వస్తుంది.

ఫరీదా భయంతో నేలమీద పడి కూర్చొని ఉన్నప్పుడు, ఇలా ప్రశ్న  అడిగాడు.

' ...నీ పేరేంటి?'

ఆమె భయపడుతూ,

'....నా.... నా పేరు ఫరీద!'

──•~❉᯽❉~•──

ఇంకా ఉంది...

ఇదా,

"హలో ఫ్రెండ్స్! మీ ఇంట్లో పులిహోరా, గుగ్గుల్లు వండి ఉంటే నాకూ పెట్టడం మర్చిపోకండీ.."

ఫరీదా,

"గుడి దెగ్గర అడుక్కుంటుంది చాలదా? ఇక్కడికీ వచ్చేసావ్? అయినా నువ్వేమయినా గుర్రానివా నీ కోసం గుగ్గుల్లు తేవడానికి? అయినా అంత పెద్ద గిన్నె తెచ్చావేంటి? దాంట్లో ముగ్గురు మనుషులు కడుపునిండా తినే అన్నం పడుతుంది.."

ఇదా,

"హిహిహి.. అందుకే తెచ్చుకున్నా! అయినా నాకు అందరూ ఎక్కడ ప్రసాదం పెట్టేస్తారోనని నీకు కుళ్ళు!"

ఫరీదా,

"ష్.... పదా దర్గాకు పోదాం! నిన్ను అక్కడ వదిలేసి పోతా అప్పుడు నువ్వు రోజూ నీ తోడు దెయ్యాలతో బిరియాని తిందువు!" అని బెదిరిస్తుంది.

ఇదా,

"నా శంక! నేను రాను!" అంటూ పారిపోతాడు.

ఫరీదా,

"గాడిద! తిరిగీ తిరిగీ కొంపకే కదా వస్తావ్! అప్పుడు నీ పని చెప్తా!...

ఆ అన్నట్టు అడగటం మర్చిపోయాను! మా సవ్యసాచికి సపోర్ట్ అంటా చెయ్యండి. రోజూ నా తల తినేస్తుంది!..*

సవ్యసాచి,

"హిహిహి.. థాంక్స్ ఫరీ బేబీ!"

ఫరీదా,

"సరేలే~ నేను వెళ్లి ఇదా గాడిని వెతుక్కోవాలి! నువ్వేదో చెప్పాలన్నావ్ కదా? అదేదో తొందరగా మన రీడర్స్కి చెప్పేసి వాళ్ళని విసిగించకుండా వెళ్ళు!~ వీడు ఎక్కడ చచ్చాడు! ఒరే ఇదా.. దర్గాలో వదలనులే! గుడిలో గుగ్గిళ్ళు పెట్టిస్తా పదా పోదాం!.." అంటూ అతన్ని వెతుకుతూ వెలుతుంది.

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సవ్యసాచి

<( ⸝⸝• ∪ •⸝⸝)>

చాప్టర్ ఎలా ఉంది? నచ్చిందా? ఏమైనా గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయా? కామెంట్ చేసి చెప్పండి.

  ૮₍  ˶  • ⊱ •  ˶ ₎ა

మీకు మన స్టోరీ నచ్చితే రేటింగ్ ఇచ్చి కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్ను ఫాలో చెయ్యడం మాత్రం మర్చిపోకండీ.

నేను రోజూ అప్లోడ్ చేసే ఫ్రీ చాఫ్టర్స్ మిస్ అవ్వకూడదు కదా?!

૮₍  ˶  • ∪ •  ˶ ₎ა

ఇదాలా సిగ్గులేకుండా అడుగుతున్నాను అని నన్ను విసుక్కోకండి.. అదీ.. హిహి..

నాకు స్టికర్స్ డొనేట్ చేయండి ప్లీస్..

నా కోసం కాదు మన ఫరీ కోసమే..

ఫరీదా ఆమె మాటలు విని కోపంతో కాలికున్న చెప్పుని తీసి సవ్యసాచి తల వైపుగా రాకెట్ స్పీడ్లో విసిరి కొడుతుంది. ఆ చెప్పు మొహానికి తగిలి సవ్యసాచి కింద పడిపోతుంది.

ఫరీదా,

"వీళ్ళిద్దరికీ సిగ్గులేదు! ఎలా ఏగాలో ఏంటో?...  బాయ్ రీడర్స్!"

୧⍤⃝💐నెక్స్ట్ చాప్టర్ లో కలుద్దాం ୧⍤⃝💐

──•~❉©Farruarts©❉~•──


SUY NGHĨ CỦA NGƯỜI SÁNG TẠO
farruarts farruarts

ఇదా,

"హలో ఫ్రెండ్స్! మీ ఇంట్లో పులిహోరా, గుగ్గుల్లు వండి ఉంటే నాకూ పెట్టడం మర్చిపోకండీ.."

ఫరీదా,

"గుడి దెగ్గర అడుక్కుంటుంది చాలదా? ఇక్కడికీ వచ్చేసావ్? అయినా నువ్వేమయినా గుర్రానివా నీ కోసం గుగ్గుల్లు తేవడానికి? అయినా అంత పెద్ద గిన్నె తెచ్చావేంటి? దాంట్లో ముగ్గురు మనుషులు కడుపునిండా తినే అన్నం పడుతుంది.."

ఇదా,

"హిహిహి.. అందుకే తెచ్చుకున్నా! అయినా నాకు అందరూ ఎక్కడ ప్రసాదం పెట్టేస్తారోనని నీకు కుళ్ళు!"

ఫరీదా,

"ష్.... పదా దర్గాకు పోదాం! నిన్ను అక్కడ వదిలేసి పోతా అప్పుడు నువ్వు రోజూ నీ తోడు దెయ్యాలతో బిరియాని తిందువు!" అని బెదిరిస్తుంది.

ఇదా,

"నా శంక! నేను రాను!" అంటూ పారిపోతాడు.

ఫరీదా,

"గాడిద! తిరిగీ తిరిగీ కొంపకే కదా వస్తావ్! అప్పుడు నీ పని చెప్తా!...

ఆ అన్నట్టు అడగటం మర్చిపోయాను! మా సవ్యసాచికి సపోర్ట్ అంటా చెయ్యండి. రోజూ నా తల తినేస్తుంది!..*

సవ్యసాచి,

"హిహిహి.. థాంక్స్ ఫరీ బేబీ!"

ఫరీదా,

"సరేలే~ నేను వెళ్లి ఇదా గాడిని వెతుక్కోవాలి! నువ్వేదో చెప్పాలన్నావ్ కదా? అదేదో తొందరగా మన రీడర్స్కి చెప్పేసి వాళ్ళని విసిగించకుండా వెళ్ళు!~ వీడు ఎక్కడ చచ్చాడు! ఒరే ఇదా.. దర్గాలో వదలనులే! గుడిలో గుగ్గిళ్ళు పెట్టిస్తా పదా పోదాం!.." అంటూ అతన్ని వెతుకుతూ వెలుతుంది.

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సవ్యసాచి

<( ⸝⸝• ∪ •⸝⸝)>

చాప్టర్ ఎలా ఉంది? నచ్చిందా? ఏమైనా గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయా? కామెంట్ చేసి చెప్పండి.

  ૮₍  ˶  • ⊱ •  ˶ ₎ა

మీకు మన స్టోరీ నచ్చితే రేటింగ్ ఇచ్చి కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్ను ఫాలో చెయ్యడం మాత్రం మర్చిపోకండీ.

నేను రోజూ అప్లోడ్ చేసే ఫ్రీ చాఫ్టర్స్ మిస్ అవ్వకూడదు కదా?!

૮₍  ˶  • ∪ •  ˶ ₎ა

ఇదాలా సిగ్గులేకుండా అడుగుతున్నాను అని నన్ను విసుక్కోకండి.. అదీ.. హిహి..

నాకు స్టికర్స్ డొనేట్ చేయండి ప్లీస్..

నా కోసం కాదు మన ఫరీ కోసమే..

ఫరీదా ఆమె మాటలు విని కోపంతో కాలికున్న చెప్పుని తీసి సవ్యసాచి తల వైపుగా రాకెట్ స్పీడ్లో విసిరి కొడుతుంది. ఆ చెప్పు మొహానికి తగిలి సవ్యసాచి కింద పడిపోతుంది.

ఫరీదా,

"వీళ్ళిద్దరికీ సిగ్గులేదు! ఎలా ఏగాలో ఏంటో?...  బాయ్ ఫ్రెండ్స్!"

୧⍤⃝ నెక్స్ట్ చాప్టర్ లో కలుద్దాం ୧⍤⃝

Load failed, please RETRY

Tình trạng nguồn điện hàng tuần

Rank -- Xếp hạng Quyền lực
Stone -- Đá Quyền lực

Đặt mua hàng loạt

Mục lục

Cài đặt hiển thị

Nền

Phông

Kích thước

Việc quản lý bình luận chương

Viết đánh giá Trạng thái đọc: C2
Không đăng được. Vui lòng thử lại
  • Chất lượng bài viết
  • Tính ổn định của các bản cập nhật
  • Phát triển câu chuyện
  • Thiết kế nhân vật
  • Bối cảnh thế giới

Tổng điểm 0.0

Đánh giá được đăng thành công! Đọc thêm đánh giá
Bình chọn với Đá sức mạnh
Rank NO.-- Bảng xếp hạng PS
Stone -- Power Stone
Báo cáo nội dung không phù hợp
lỗi Mẹo

Báo cáo hành động bất lương

Chú thích đoạn văn

Đăng nhập