"నువ్వు జాగర్తగా ఉంటే మంచిది! ఇంకోసారి నిన్ను క్షమించి వదిలేదే లేదు."
అని చెప్పి, ముగ్గురూ వెళ్ళిపోతారు.
సవ్యసాచి:....
వెన్నెల తన సామాన్లు బ్యాగ్ లోకి తిరిగి సర్దుకుంటూ ఉంటుంది.
సవ్యసాచి: వెన్నెల.. నీకేం కాలేదు కదా?..
వెన్నెల:...
ఆమె జవాబు ఇవ్వదు. సవ్యసాచిని పట్టించుకోకుండా బ్యాగ్ తొడుక్కొని ముందుకు నడుస్తుంది.
సవ్యసాచి:....
సవ్యసాచి ఆమె వెనుకే నడుస్తూ వెలుతుంది.
సవ్యసాచి: నువ్వు ఈరోజు క్లాస్కి ఎందుకు రాలేదు?
వెన్నెల:....
సవ్యసాచి: నువ్వు ఫోన్ కూడా ఎత్తలేదని టీచర్ చెప్పారు.
వెన్నెల:...
సవ్యసాచి: నీ బ్యాగ్లో చాలా పెట్ ఫుడ్ ఉంది? మీ ఇంట్లో పెట్స్ ఉన్నాయా?
వెన్నెల:...
సవ్యసాచి: నేను పిల్లుల్ని పెంచుతున్నాను.
వెన్నెల:...
ఆమె ఏమీ జవాబు ఇవ్వకుండా సైలెంటుగా నడుస్తుంది.
సవ్యసాచి కూడా ఆమె జవాబు ఇవ్వట్లేదని కోప్పడదు.
సవ్యసాచి: హా!.. నా ఇళ్ళు ఇటు!!.. బాయ్ వెన్నెలా!! రేపు కలుద్దాం!!
అని టాటా చెబుతుంది.
వెన్నెల వెనక్కి కూడా చూడకుండా వెళుతుంది.
సవ్యసాచి:....
సవ్యసాచి అప్సెట్ ఏమి అవ్వకుండా తన ఇంటికి బయలుదేరుతుంది.
@@@
సవ్యసాచి తన ఇంటికి చేరుకుంటుంది. తలుపు తెరుస్తూ,
సవ్యసాచి: బైరవ! నేనొచ్చేసా!!
అని సంతోషంతో చెబుతుంది.
ఇంట్లో మూడు పిల్లులూ తిరుగుతూ ఉంటాయి.
*meow*
*meow*
*meow*
సవ్యసాచి: హై గైస్!! తిన్నారా లేదా?
*meow*
*meow*
*meow*
సవ్యసాచి పిల్లులను పలకరిస్తుంది. అవి మూడు కూడా ఆమె దెగ్గరికెళ్లి చుట్టూ తిరుగుతూ ముద్దు చేస్తుంటాయి.
ఒకటేమో సవ్యసాచి వీపు గోళ్ళతో గీకుతూ ఉంటుంది.
ఇంకోటేమో ఆమె చేతికి తల రుద్దుతూ ఉంటుంది.
మూడోడేమో సవ్యసాచి కాలికి బాడీ ఏసి రుద్దుతూ ఉంటుంది.
ఆమె రక్షించిన పిల్లేమో సోఫా మీద నిద్రపోతూ ఉంటుంది.
సవ్యసాచి: హహహ... అవును! బైరవ ఏడీ?..
మెట్ల పైన ఉన్నాడా?
అని అడుగుతూ, బ్యాగ్ దించి మెట్ల పైకి వెళుతూ ఉంటుంది.
*ధప్* *ధప్* *ధప్*
మని వేగంగా మెట్లు ఎక్కి డోర్ తెరుస్తుంది.
సవ్యసాచి: బైరవ! బైరవ?!... ఎక్కడున్నావ్?
అని పిలుస్తూ రూం అంతా చూస్తుంది.
ఎక్కడా కనిపించడు.
సవ్యసాచి:... ఎక్కడికెళ్లాడు?..
ఆమె ఒక్కో గదిలోకి వెళ్లి అతని కోసం వెతుకుతుంది.
సవ్యసాచి: బైరవ?...
°°°
బైరవ?...
°°
బై..రవ...
...
ఆమె నిరాశతో మెట్లు దిగి వరండాలోకి వస్తుంది.
ఆమె బాధ పడుతూ తల దించుకుంటుంది.
సవ్యసాచి: లేదు...
బైరవ..
ఇళ్ళు వదిలేసి వెళ్లిపోయాడా?..
అది కూడా...
నాకు గుడ్ బాయ్ చెప్పకుండానే?...
అని ఆలోచిస్తూ అప్సెట్ అయి పిడికిలి బిగిస్తుంది.
బాధ అనుచుకోలేక పెద్ద గొంతుతో ఇలా అంటుంది.
సవ్యసాచి: నో.... నాకు గుడ్ బాయ్ చెప్పకుండా అలా ఎలా వదిలి వెళ్ళిపోతావ్!?....
కనీసం ఆరోగ్యం బాగయ్యే వరకయినా నాతో ఉండొచ్చు కదా?!!...
అంత తొందరేంటి?!!...
కనీసం ఒక మాట కూడా చెప్పకుండా వెళ్లాడానికి పొడిచే పనేముంది?
అని కోపంతో ఊరంతా వినిపించేలా గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది.
బైరవ (పిల్లి):.... దీ@మ్మ!!....
పాతేస్తా దీన్ని...
కనీసం బాత్రూమ్లో కూడా మనస్సంతిగా ఉండనీదిది..
అని బాత్రూం మీద కూర్చొని ముక్కుతూ కోపాన్ని అనుచుకుంటూ ఉంటాడు.
(బైరవ బాత్రూమ్లో ✌️లెటిన్ పోతూ ఉన్నాడు💩🤣🤣)