టైం: *నెక్స్ట్ డే మార్నింగ్*
సవ్యసాచి హాల్లో కూర్చొని యోగా చేస్తూ ఉంటుంది.
ఆమె బ్రీతింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది.
బైరవ (పిల్లి): ఎనర్జీ యొక్క మూమెంట్ తెలుసుకుంటుందని నా పవర్ని ఆమె శరీరంలోకి పంపాను.
అలా చేసి గంటలు మాత్రమే అవుతోంది...
అంతలోనే ఆ శక్తిని గుండె నుంచి ఛానెల్ చేయటం కూడా నేర్చేసుకుందా!?..
అని ఆలోచిస్తూ ఉంటాడు.
సవ్యసాచి: హఫ్!... నువ్వు నేర్పినట్టే చేస్తూ ఉన్నాను.
కాకుంటే నాకేం మార్పు తెలీట్లేదు.
అసలు నేను నా శక్తిని నేను సరిగ్గా కంట్రోల్ చేస్తున్నానో కూడా నాకు అర్ధం కావట్లేదు.
అని తికమక పడుతుంది.
బైరవ (పిల్లి): నీ చెవులు పని చేస్తున్నాయా? లేదా? నిన్న చెప్పా కదా?!
చాలా ప్రాక్టీస్ చేస్తేనే నీ పవర్స్ మెరుగుపడుతాయి!
సవ్యసాచి: రియల్లీ? హహహ...
ఆమె నిరాశ పడుతుంది.
సవ్యసాచి: అయినా సరే, కనీసం నా బాడీ లోని ఎనర్జీ మూవ్ అవ్వడం అయినా ఫీల్ అవుతానని అనుకున్నాను.
ఇందాక ఏదో ఫీలింగ్ అనిపించినట్టే ఉనింది.. బహుశా నాకు టాలెంట్ లేదేమో..?
అని తల వంచుకొని నిరాశ పడుతుంది. అదే సమయంలో,
*అలార్మ్*
*tring*
*triiiinnnggg*
*ttttriiiiiinnnnggggg*
*మని గట్టిగా సౌండ్ చేయటం మొదలుపెడుతుంది.
సవ్యసాచి, బైరవ ఇద్దరూ ఒకేసారి తిరిగి చూస్తారు.
సవ్యసాచి: బాబోయ్!! అప్పుడే ఉదయం 8:00 am అయిపోయిందా?!!?
కాలేజ్కి లేట్ అయిపోతుంది!!!
అని పరుగులు తీస్తుంది.
బైరవ (పిల్లి): ఓహ్? అవునా?
అని కింద కూర్చొని ఆమెను గమనిస్తూ ఉంటాడు.
ఆమె బెడ్ రూంలోకీ వెళ్లి హడావిడిగా రెడీ అయ్యి, వీపుకి బ్యాగ్ తగిలించుకొని రూమ్ నుంచి బయటకు వస్తుంది.
సవ్యసాచి: అరెరే!! మీకు ఫుడ్ ప్రిపేర్ చేయటం మర్చిపోయాను!!
ఫుడ్ పాకెట్ ఎక్కడ పెట్టను?....
అని హడావిడిగా కేకలేస్తూ పరుగులు తీస్తూ ఉంటుంది.
సవ్యసాచి: ఆహ్....
ఆమె క్యాట్ ఫుడ్ బస్తా మోసుకుంటూ వచ్చి 4 క్యాట్ ప్లేట్స్ లో నింపుతుంది.
ఒక ప్లేట్ తీసుకొచ్చి బైరవ (పిల్లి) ముందు ఉంచుతుంది.
ఆమె హడావిడిగా షూస్ వేసుకొని బయటకు వెళుతూ,
సవ్యసాచి: బైరవ! నేను కాలేజ్ కి బయలుదేరుతున్నా!!
నీకూ మిగతా మూడు పిల్లులకి ఫుడ్ వేరు వేరుగా ఉంచాను.
మిగల్చ కుండా తినేయండి..
అని చెప్పి తలుపులు వేసి వెళ్లి పోతుంది.
బైరవ (పిల్లి):....
హా.... 😮💨
బైరవ ఇంట్లో ఒంటరిగా నిలబడి ఉంటాడు.
బైరవ: ఈ పిల్ల తినడం మర్చిపోద్ది గానీ పిల్లులకి మాత్రం ఫుడ్ పెట్టడం మర్చిపోదు!~
ఇందాక ఏమనింది?...
"బహుశా నాకు టాలెంట్ లేదేమో..?" నా?!!
టాలెంట్ లేదా?
నా బొంద!!
ఆ పిల్లకి తెలీలేదు గానీ తన గుండె నుంచి ఎనర్జీ ఫ్లో అవుతూ ఉండటం నేను గమనించాను.
ఎనర్జీ గాథర్ చేసేటప్పుడు అలాగే జరుగుతుంది.
ఒక వ్యక్తి ఇంత త్వరగా శక్తులను కంట్రోల్ చేయటం నేర్చుకోవడాన్ని నేనెప్పుడూ చూడలేదు.
అంటే.. నేను కాకుండా ఎవరినీ చూడలేదు.
ఆగు!..?
ఓరి దేవుడా!!!...
నా మెథడ్ అంత ఎఫెక్టివా??!!
అలోచించి చూస్తే నేను ఇప్పటి వరకూ నా మెథడ్ ని ఎవరికీ నేర్పించలేదు.
అంటే.....
నేను గనుక వేరే అవేకనర్స్ కి నా మెథడ్ నేర్పించుంటే ఇంతే త్వరగా ప్రాగ్రెస్ అయుండేదేమో?
అదే అయుండాలి!!!
నా మెథడ్ చాలా ఎఫెక్టివ్! అందుకే సవ్యసాచి త్వరగా ఇంప్రూవ్ అయ్యింది!!!
అంతెందుకు? నా మెథడ్ వల్ల తనలోని ఎనర్జీ ఫ్లో కూడా పసిగట్ట గలిగింది!!
అంతే కదా!!
సవ్యసాచి టాలెంటెడ్ కాదు!!!!
ఆ మెథడ్స్ నేర్పించిన నేనే టాలెంటెడ్ !!!
నాకు నా దిష్టే తగిలేలా ఉంది!! .. ..
కికికికికికికి... .... ..
అని ఆలోచిస్తూ పిచ్చోడిలా మెలికలు తిరుగుతూ నవ్వుతుంటాడు.