మహేంద్ర నిదానంగా పైకి లేచి గాల్లో ఎగురుతున్న పక్షులను చూస్తూ ఉంటాడు.
మహేంద్ర: వావ్... నేను చూస్తుంది కలా? నిజమా?..
మహేంద్ర భుజానికి దెబ్బ తగిలి నొప్పిగా అనిపిస్తుంది.
మహేంద్ర: కల అయుంటే ఇలా నొప్పిగా అనిపించదు కదా?..
నొప్పెడుతుందంటే.. నేను చూస్తుందాంతా నిజమేనా?..
లేకుంటే భ్రమ?..
కంఫర్మ్ చేసుకోవాలి!
••••••••••••••••••••••••••••••••••••••••••••••••
అతను కాసేపు దిక్కులు చూస్తూ నడుస్తూ ఉంటాడు.
కాసేపు తర్వాత, ఒక ఎత్తైన ప్రదేశానికి చేరుకుంటాడు.
పైనుంచి చూస్తే దూరంగా ఒక పెద్ద సిటీ కనిపిస్తుంది.
మహేంద్ర: ఒక అడవి దెగ్గర.. ఇంత పెద్ద సిటీ ఎలా ఉంది? ఇదేం ఊరయి ఉంటుంది?..
అతను కొండ నుంచి నిదానంగా దిగుతూ వెళుతూ ఉంటాడు.
ఒక చెట్టు కొమ్మను పట్టుకొని దిగుతూ ఉండగా అతని చేతికి ఏదో తగులుతుంది.
మహేంద్ర: హ్మ్?... ఏంటిది?.. పసుపు రంగులో ఉంది?..
అది కళ్ళు తెరిచి చూస్తుంది.
*bzzz*
అది ఒక బీడ్రిల్.
మహేంద్ర: బ-బ-బ-బ- బీడ్రిల్?...
ఎంతో కోపంగా అతన్ని చంపేసేట్టుగా చూస్తుంది.

మహేంద్ర గుండె ఆగినంత పనువ్వుతుంది.
బీడ్రిల్స్ కి కోపం ఎక్కువ. వాటి నెస్ట్ ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ప్రాణాలు తీయడానికి కూడా సంకోచించవు.
పోకిమాన్ల గురించి బాగా తెలిసిన మహేంద్ర ఒక్క క్షణం కూడా అలోచించకుండా వేగంగా పరుగులు తీస్తాడు.
అవి గుంపులుగా దాడి చేయడానికి వెంట పడుతూ ఉంటాయి.
అతను అలా పరిగెడుతూ ఉండగా చూసుకోకుండా ఎత్తైన కొండ చివర నుంచి దుకేస్తాడు.
మహేంద్ర: ఆ..........
అని గట్టిగా అరుస్తాడు.
అక్కడి నుంచి పడిపోతూ ఉండగా ఒక పెద్ద ఆకారంలోని పక్షి ఎగురుకుంటూ వచ్చి అతన్ని కాళ్ళతో పట్టుకొని మరో దిక్కుకి ఎగురుకుంటూ వెళ్లి పోతుంది.

మహేంద్ర: ఆ.......
బీడ్రిల్స్ ఇక అతన్ని అనుసరించవు.
ఆ పక్షి మెరుపు వేగంతో ఎగురుకుంటూ వెళుతూ ఉంటుంది.
వేగం ఒత్తిడికి మహేంద్ర కంగారు పడుతూ నీటి నుంచి బయట పడిన చేపలా గిల గిలా కొట్టుకుంటూ ఉంటాడు.
చాలా ఎత్తులో ఎగురుతూ ఉండటం వల్ల, కాసేపటికి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువై స్పృహ కోలిపోతాడు.
ఆ వింత పక్షి ఒక రోజంతా గాల్లో ఎగురుతూనే వెళుతూ ఉంటుంది.
𓅮~~~~~~~~
సాయంత్రం అవుతుంది.
ఒక 250 అడుగు ఎత్తైన చెట్టు ఎక్కి కూర్చుంటుంది.
ఆ చెట్టు పైన దాని నెస్ట్ ఉంటుంది.
మహేంద్రని నెస్ట్ లోన పడేసి మళ్ళీ వేరే దిక్కుకి ఎగిరిపోతుంది.
అతను నెస్టులో పడి దొర్లుకుంటూ పోయి చివరన ఢీ కొట్టుకుంటాడు.
ఒళ్ళంతా అదరడంతో బిత్తరపోయి లేచి కూర్చుంటాడు.
నొప్పికి తల రుద్దుకుంటూ ఉంటాడు.
మహేంద్ర: ఆ.... నేనెక్కడ ఉన్నాను?...
ఇదేం చోటు?..
అని అనుకుంటూ దిక్కులు చూస్తాడు.
చూడటానికి పక్షి గూడులా కనిపిస్తుంది.
అతని చుట్టురా ఏవేవో వస్తువులు కుప్పలు తెప్పలుగా పడి ఉంటాయి.
ఆ పక్షికి నచ్చిన వస్తువులని ఎత్తుకొచ్చి గూడులో పెడుతుందని అర్థం చేసుకుంటాడు.
మహేంద్ర: అదొక వింత పక్షి..
నా జీవితంలో అలాంటి పక్షిని ఎప్పుడూ చూడలేదు.
కానీ, దాన్ని ఎక్కడో చూసినట్టే అనిపిస్తోంది..
ఎక్కడ చూసుంటానబ్బా...
.......
అతను ఆలోచనల్లో పడుతాడు.

ఆ పక్షి పేరు అతనికి గుర్తుకు రాదు. కాసేపు ఆలోచిస్తూ దాని రూపాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు.
నెస్టులో ఆ పక్షి యొక్క ఊడిపోయిన ఫెదర్స్ కనిపిస్తాయి.
వాటిలో ఒక రెక్కను చేతిలోకి తీసుకుంటాడు.
చేతిలోకి తీసుకోగానే అది బంగారు రంగులో మెరుస్తుంది.
అతను అశ్చర్యంతో నోరు తెరుస్తాడు.
మహేంద్ర: ఓ....... ఇప్పుడు గుర్తొచ్చింది...
దీని పేరు... హో-ఓహ్...