సవ్యసాచి: బ-బాయ్!...
అతను చూపు తిప్పుకుంటాడు.
ఆమె తలుపుల చాటున నిలబడి తొంగి చూస్తుంది.
సవ్యసాచి: భైరవ గారూ.
భైరవ: ఇప్పుడేంటి?
సవ్యసాచి: నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో ఉంటావు కదా?
భైరవ: ఏంటి?
సవ్యసాచి: నీకు ఒంట్లో బాగోలేదు కదా! కనీసం నయమయ్యే వరకైనా నాకోసం ఇంట్లో ఉండొచ్చుగా?
భైరవ: హహ్?..
సవ్యసాచి: ప్లీస్... ప్రామిస్ చేయ్!...
ఆమె చెప్పులు వేసుకొని బయటకు పరిగెట్టుకుంటూ వెళుతూ ఉంటుంది.
ఆమె వెళ్ళిపోతుంది.
భైరవ తలుపుల వైపే చూస్తూ ఉంటాడు.
భైరవ: హ్మ్....
ఆ పిల్ల అంతగా బ్రతిమిలాడింది కాబట్టి నాకు మరొక అవకాశం లేదు.
కొన్నాళ్ళు ఇక్కడే ఉండటంలో తప్పు లేదనే అనుకుంటా!~
అతను ఆలోచిస్తూ ఇంట్లోకి నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు.
అటువైపుగా ఉన్న అద్దంలో తనను తాను చూసుకొని చిరాకు పడుతాడు.
దీనమ్మ!...
బండ పిల్లియో....
••••
***మీఔ...
***మీఔ...
***మీఔ...
..మంటూ మూడు పిల్లులు తలుపుల నుండి నడుచుకుంటూ వస్తాయి.
భైరవ వాటిని గమనిస్తాడు.
భైరవ:??
°°°
***మీఔ...
***మీఔ...
***మీఔ...
భైరవ: ఇవి ఎవరి పిల్లులు?
ఒక్కో పిల్లి భైరవను వాసన చూస్తూ మెల్లగా దెగ్గరకు వెళ్లి బాడీ బాడీ రుద్దుతూ ఉంటాయి.
భైరవ:.... హే?... ఏం చేస్తున్నావ్?.. దూరం పో! షూ! షూ.....! నువ్వు కూడా దూరం పో!...
ఛా!...
పిల్లులు నిదానంగా ప్లేట్స్ లో ఉంచిన కాట్ ఫుడ్డు వాసన చూసుకుంటూ తినడానికి వెళతాయి.
***మీఔ...
***మీఔ...
***మీఔ...
భైరవ: ఎంత ధైర్యం ఉంటే ది గ్రేట్ భైరవ ఆహారాన్నే దొంగలించాలని చూస్తారు?!
ఒక పిల్లి ప్లేట్లోని ఫుడ్డుని తినడానికి నోరు తెరుస్తుంది.
భైరవ కోపంతో అతని ఆరా బయటకు వదులుతాడు.
అతని ఆరా చూసి మూడు పిల్లులు భయంతో బిగుసుకుపోతాయి.
భైరవ: నాకు మీ పద్ధతి నచ్చలా! నా చేతుల్లో చావక ముందే దూరంగా దొబ్బెయ్!
..మని కోపంతో అరుస్తాడు.
మూడు పిల్లులు భయంతో కదలకుండా నీలుక్కుపోతాయి.
ఆసమయంలో భైరవకి సవ్యసాచి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి.
°°°°
సవ్యసాచి: నేను నిన్నెలా కనిపెట్టాననా?
నా ఇంటికి ప్రతీ రోజూ మూడు పిల్లులు వచ్చేవి.
అవే నువ్వున్న చోటుకి నన్ను తీసుకొని వెళ్లాయి.
నువ్వు గాయాలతో నేల మీద పడి ఉన్నావని చూసి ఇంటికి తీసుకొచ్చి వైద్యం చేశాను...
అవి కనుక లేకుంటే నేను నిన్ను కనిపెట్టుందాన్నే కానేమో..
°°°
అతను చూపు తిప్పుకొని వెలుతాడు.
భైరవ: ఛా!..
తొక్కలో కాట్ ఫుడ్ నాకేం ఇష్టం లేదులే~
అతను వెళ్లి నేల మీద పనుకుంటాడు.
మూడు పిల్లులు అతన్నే గమనిస్తూ ఉంటాయి.
అతనికి చిక్కకుండా మెల్లగా నడుచుకుంటూ వెళ్లి కాట్ ఫుడ్ నములుతూ ఉంటాయి.
అతను వాళ్ళ వైపు తిరిగి చూస్తాడు.
***మీఔ...
***మీఔ...
***మీఔ...
..మంటూ వేగంగా తినడం మొదలుపెట్టారు.
భైరవ: మరీ అంత ఆత్రంగా తినడం ఎందుకో?
నేనేం వాళ్ళ నోటి దెగ్గర నుంచి లాక్కొని తినట్లేదుగా!~
అతని పొట్ట శబ్దం చేస్తుంది.
*తుర్ర్..*
*తుర్ర్..*...
అతనికి కూడా ఆకలి వేస్తుంది. దిక్కులు చూస్తూ ఉండగా ఒక అట్ట పెట్టె మీద ఒక మెటల్ డబ్బా కనిపిస్తుంది.
అది కాట్ ఫుడ్ కాన్.
భైరవ: ఇప్పుడు దిన్నెలా తెరవాలి?
అతని పంజాల వైపుగా చూపు మళ్ళుతుంది.
*తడా...*
అతని పంజాలతో డబ్బాను సులువుగా తెరుస్తాడు.
భైరవ: హిహిహిహిహి...
అతని వెనుక నుంచి ఏదో శబ్దం వినిపిస్తుంది.
భైరవ: హహ్?..
అతను వెనక్కి తిరిగి చూస్తాడు.
మూడు పిల్లులు అతన్ని సూటిగా చూస్తూ ఉంటాయి.
భైరవ: హహ్...?
°°°°°
సాయంత్రం సవ్యసాచి స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుంది.
సవ్యసాచి: నేనింటికి తిరిగొచ్చేసా!
భైరవ! నేను వచ్చేసా! ఎక్కడున్నావ్?
హహ్?..
ఆమె అశ్చర్యబోతుంది.
సవ్యసాచి: ఏమైన్దిరా మీకూ?...
మూడు పిల్లులు గురక పెడుతూ బోర్లా పనుకుని నిద్ర పోతూ ఉంటాయి.
వాటి చుట్టూ చాలా కాట్ ఫుడ్ కాన్స్ పడి ఉంటాయి.
ఆమె ఒక కాన్ చేతిలోకి తీసుకొని గమనిస్తూ ఉంటుంది.
సవ్యసాచి: ఈ పిల్లులు మెటల్ కాన్స్ ఎలా తెరవగలిగాయబ్బా?..
చూస్తుంటే.. దేనితోనో కోసినట్టు ఉంది..
అయినా ఇన్ని కాన్స్ ఎలా కోయగలిగాయి?..
దేనితో కోయగలిగాయి?..
ఓరి దేవుడా....
°°°
భైరవ ఒక దిండు మీద తల ఆనిచ్చి, జొళ్లు కారుస్తూ, నేల మీద బోర్లా పనుకుని ఉంటాడు.
**గురక సౌండ్**
**గురక సౌండ్**
**గురక సౌండ్**