ఆకాశం నుంచి నేల మీదకు పెద్ద మెరుపు పడుతుంది.
భైరవ గాల్లో ఎగురుతూ నిలబడి ఉంటాడు.
నేల మీద అతని ఆపోనెంట్ ఓడిపోయి పడి ఉంటాడు.
"నేను ఓటమిని ఒప్పుకుంటున్నాను భైరవ!... నువ్వే గెలిచావు.."
భైరవ అతని మాటలు ఏమాత్రం పట్టించు కోకుండా దాటుకొని వెళ్ళిపోతాడు.
"మళ్ళీ భైరవేనా?.."
"గెలవటం ఇదెన్నోసారి?.."
"బలంగా ఎవరు కనిపించినా వాళ్ళతో గొడవపడి ఓడించేస్తాడు.."
"నీకొకటి తెలుసా?.. ఫేమస్ వ్యక్తులు భయంతో ఇతనితో గొడవ పడటానికే ముందుకు రారంట!"
"ఇతనితో ఒళ్ళు పగలగొట్టుకోవాలని ఎవరికి మాత్రం ధైర్యం ఉంటుంది చెప్పూ?...."
"ఎందుకంటే.. భైరవ ప్రపంచంలోని టాప్ 10 అవేకెనర్స్ తో సమానంగా శక్తివంతుడు కనుక.."
****
"భైరవ! మాలో ఒకడిగా చేరు..
మనిద్దరం కలిసి ఈ లోకాన్నే పరిపాలిద్దాం!.."
*****
"భైరవ! మాతో రా!.."
"నువ్వు మాతో ఉంటే.. ఈ లోకాన్ని పరిపాలించడం సాధ్యం అవుతుంది.."
*****
"భైరవ గారూ.. మేము మీ బానిసలుగా జీవితాంతం ఉంటాము.. దయచేసి మమ్మల్ని మీ శిష్యులుగా చేసుకోండి.."
అందరూ మోకాళ్ళ మీద కూర్చొని బ్రతిమాలుతారు.
"భైరవ గారూ..."
"..భైరవ గారూ...."
"...భైరవ గారూ......"
****
సవ్యసాచి: భైరవగారు?!..
అతను వెంటనే స్పృహలోకి వస్తాడు.
సవ్యసాచి: భైరవ.. ఏం చేస్తున్నావ్?..
అతను అసలైన పిల్లిలా నేల మీద పడి దొర్లుతూ కాట్ టాయ్ తో ఆడుతూ ఉంటాడు.
అవమానంతో అలాగే కదలకుండా ఉండిపోతాడు.
మాంస్టర్ కాట్ వేగంగా వచ్చి కాట్ టాయ్ను నోటికి కరుచుకుని పట్టుకుంటుంటుంది.
భైరవ షాక్ లో ఉంటాడు.
నేను.. ఇప్పటి దాకా నేనేం చేస్తున్నాను?..
గట్టిగా లాగడంతో సవ్యసాచి చేతి నుంచి కాట్ టాయ్ జారి పోతుంది.
మాంస్టర్ కాట్ కాట్ టాయ్ ని దూరంగా లాక్కొని వెళ్లి నములుతూ ఉంటుంది.
నా శరీరం దానంతట అదే కదిలింది...
***గ్ర్ర్.... హిస్స్...***
ఆమె భయంతో గుటకలు మింగుతుంది.
సవ్యసాచి:... నేనిప్పుడు ఏం చెయ్యనూ...
ఆమె పిల్లి కన్ను దెగ్గర ఉన్న పాత గయాన్ని గమనిస్తుంది.
సవ్యసాచి: ఆ గాయం...
ఆమె రోజూ ఆహారం పెట్టే పిల్లులలో తను కూడా ఒక పిల్లి అని గుర్తుకొస్తుంది.
సవ్యసాచి: అసాధ్యం.. నువ్వూ...
మాంస్టర్ కాట్ టాయ్ ని దూరంగా లాక్కొని వెళ్లి నమిలి పడేసి మీదకు దూకుతుంది.
సవ్యసాచి వెంటనే జరిగి దూరంగా దూకుతుంది.
ఆ.....
బండ పిల్లి శరీరం..
బొమ్మ కనిపిస్తే బుద్ధి లేకుండా ఎగరడమేనా?...
ఎదవ పొట్టేసుకొని...
ఆ....
నన్ను నేనే తిట్టుకుంటున్నానేంటి?...
పిచ్చి పూ పిల్లి శరీరం...
లేదు అది నేను కాదు.....
ఆ.....
సవ్యసాచి వేగంగా వచ్చి భైరవను చేత్తో ఎత్తుకొని దూరంగా పరుగులు తీస్తుంది.
వాళ్లిద్దరూ కనిపించక పోవడంతో కంటికి కనిపించిన వస్తువులన్నీ ధ్వంసం చేస్తుంది.
హిస్....
***
వాళ్లిద్దరూ ఆ చోటు నుంచి దూరంగా వచ్చి చాటుగా నిలబడి ఉంటారు.
సవ్యసాచి: హఫ్... హఫ్... హఫ్...
నువ్వు చెప్పినట్టు అది పిల్లే..
భైరవ: మరే~
ఆమె అక్కడి నుంచి బయటకు తొంగి చూస్తుంది.
సవ్యసాచి: ఆ పిల్లెందుకు అలా ఉంది?..
చాలా విచిత్రంగా ఉంది..
ఆ పిల్లి చూడటానికి... పెద్దగా ఉంది..
భైరవ: నాకేం తెలుసు? నేనేమైనా ఆ పిల్లికి లవర్ణా?..
బహుశా ఆకలేసి నందువల్ల అల్లరి చేస్తున్నట్టుంది.
సవ్యసాచి: చుట్టుపక్కల లేదంటే మనల్ని వెంబడించలేదనే అర్ధం.
హమ్మయ్య.. ఇప్పుడు మనం మనస్సాంతిగా ఉండొచ్చు..
భైరవ:.. బహుశా నువ్వు మాత్రమే..
సవ్యసాచి: అంటే అర్ధం?
భైరవ: మనం కాబట్టి పారిపోయాం. మరి ఇతరుల గురించేంటి? ఎవరైనా దానికి కనిపించారో తొక్క తీసేత్తది.
ఇపుడు రాత్రి కాబట్టి ఎవరూ బయట లేరు.
కానీ తెల్లారితే? టైం బాగోక ఎవడైనా బయటకి వస్తే?
ఒకవేళ మాంస్టర్ కాటే వేరొకరి కొంపలోకి దూరితే?
వాళ్ళకి ఆ కాట్ మాంస్టర్తో జింతాత్త చితా చితా జింతాత్తతా అయిపోద్ది.
సవ్యసాచి: మారాయితే ఏం చెయ్యను?...
నాకసలు ఆ ఆలోచనే రాలేదు..
భైరవ: దానర్థం ఏంటి?..
ఒకటే ఆలోచన!.
వెనక్కి తిరిగి చూడకుండా పారిపోడమే!..
సవ్యసాచి: నువ్వు కూడా చూసావు కదా?
అది ఎంత ఫాష్టుగా పరిగెట్టిందో?..
అలాగే వదిలేస్తే.. పాపం ఎవరైనా గాయపడొచ్చేమో..
భైరవ: మరైతే పోలీసులకు కాల్ చేసి చెప్పూ.
సవ్యసాచి:.. అం.. ఫోన్ ఇంట్లో పెట్టి మర్చిపోయా.. హిహిహి...
భైరవ: అయితే ఇక చేసేదేముంది? ముందడుగు వేసే ఆలోచన తప్పా..
సవ్యసాచి: ముందడుగు వేయడానికి నేను సిద్ధం.
భైరవ: అసలేం వాగుతున్నావ్?..
లోతు తెలుసుకోకుండా వేలు పెట్టడం అవసరమా?
నీ వేలే కంపు నుకేది.
సవ్యసాచి:... భైరవ గారూ... మీరు.. బూతులు మాట్లాడుతున్నారు...
లోతు తెలుసుకోకుండా వేలు పెట్టడం అనరు..
కాలు పెట్టడం అంటారు..
భైరవ: నువ్వు నా తెలుగు టీచర్ మరీ. స్పెల్లింగ్ మిస్టేక్స్ కి మార్కులు తీసేయడానికి.
వెళ్లి దాని నోట్లో ఏలెట్టావో నీ తొక్క తీసేత్తది.
దాని పంజాలు చూసావా? ఎంత పెద్దగా ఉన్నాయో?
టప్పున కొడితే ఫట్టున పోతావ్!
సవ్యసాచి:... కానీ...
భైరవ: కానీ గీనీలేం లేవ్!
ఇంటికి పోయి పలుతాగి, కళ్ళు మూసుకొని, కాళ్ళు చాపుకొని పనుకో.
తెల్లారేలోపు అన్నీ మర్చిపోతావ్.
సవ్యసాచి: వేరొకరు గాయపడుతారని తెలిసి కూడా అలా ఎలా వదిలి వెళదాం?..